కొరటాల బాధ అర్థం చేసుకున్న మెగాస్టార్‌?

Update: 2020-07-21 14:30 GMT
భరత్‌ అనే నేను చిత్రం తర్వాత కొరటాల శివ తదుపరి చిత్రాన్ని చిరంజీవితో చేసేందుకు కమిట్‌ అయ్యాడు. సైరా చిత్రం కారణంగా కొరటాల శివ దాదాపుగా రెండేళ్ల పాటు వెయిట్‌ చేయాల్సి వచ్చింది. సరే ఎట్టకేలకు చిరంజీవితో ఆచార్య మొదలైంది అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా షూటింగ్‌ కు కరోనా అడ్డంకిగా మారింది. మెగాస్టార్‌ వయసు ఆరోగ్యం దృష్ట్యా ఈ ఏడాది చివరి వరకు ఆచార్య మొదలు అయ్యే అవకాశం లేదనే ప్రచారం జరిగింది. అదే కనుక జరిగితే కొరటాల శివ మరో ఏడాది నష్టపోవాల్సి వస్తుంది.

వరుసగా సూపర్‌ హిట్‌ చిత్రాలను తెరకెక్కించిన కొరటాల శివకు ఇలాంటి పరిస్థితి రావడంపై కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ట్యాలెంటెడ్‌ దర్శకుడి కెరీర్‌ లో అతి పెద్ద గ్యాప్‌ కు చిరంజీవి కారణం అంటూ కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు. కొరటాల కూడా ఆచార్య చిత్రంను త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నాడు. అలా అని మెగాస్టార్‌ ను ఒత్తిడి చేయలేని పరిస్థితి. కొరటాల బాధను అర్థం చేసుకున్న చిరంజీవి రిస్క్‌ తీసుకుని షూటింగ్‌ కు హాజరు అయ్యేందుకు సిద్దం అయ్యాడట.

ప్రస్తుతం ఆచార్య కోసం ఒక భారీ దేవాలయం సెట్‌ మరియు ఆఫీస్‌ సెట్‌ ను నిర్మిస్తున్నారట. ఆ సెట్‌ లో దాదాపుగా మూడు నుండి నాలుగు వారాల పాటు చిత్రీకరణ జరుగనుందట. ప్రస్తుతం సెట్‌ నిర్మాణం జరుగుతుంది. అది వచ్చే నెలలో పూర్తి కానుంది. ఆ వెంటనే అంటే సెప్టెంబర్‌ మొదటి వారం నుండి చిరంజీవి షూటింగ్‌ కు హాజరు అవ్వాలని భావిస్తున్నాడట. షూటింగ్‌ రోజులను కుదించడంతో పాటు స్పీడ్‌ గా పూర్తి చేసేలా స్క్రీన్‌ ప్లేలో మార్పులు చేశారట.

సెప్టెంబర్‌ లో సినిమా మొదలు పెడితే అక్టోబర్‌ చివరి వరకు పూర్తి చేసేలా ప్లాన్‌ చేయాల్సిందిగా మెగాస్టార్‌ సూచించారట. ఈ ఏడాదిలోనే సినిమాను పూర్తి చేసి విడుదలను వచ్చే ఏడాదిలో ప్లాన్‌ చేసే అవకాశం ఉందంటున్నారు. ఆచార్య పూర్తి అయిన వెంటనే మరో స్టార్‌ హీరోతో కొరటాల సిమాకు ఇప్పటికే కన్ఫర్మ్‌ అయ్యాడు. అది వచ్చే ఏడాది ఆరంభంలోనే పట్టాలెక్కే అవకాశం ఉంది. 2021లో కొరటాల ఆచార్యతో పాటు మరో సినిమాను కూడా విడుదల చేసే అవకాశం ఉందంటున్నారు.
Tags:    

Similar News