గత మూడు నెలలుగా మూత పడి ఉన్న థియేటర్లు ఎప్పుడు తెరిచేది ఇప్పట్లో చెప్పలేని పరిస్థితి. రాబోయే రోజుల్లో థియేటర్లు తెరిచినా కూడా పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది ఏ ఒక్కరు ఊహించలేక పోతున్నారు. ఖచ్చితంగా మునుపటి పరిస్థిలు మాత్రం ఇప్పట్లో వచ్చే అవకాశం లేదని ప్రతి ఒక్కరు అంటున్నారు. కనీసం రెండు సంవత్సరాల పాటు ఈ సంక్షోభం తప్పదని అంటున్నారు. అందుకే సినిమాల మేకింగ్ విషయంలో నిర్మాతలు కాస్త వెనుక ముందు ఆలోచిస్తే బాగుంటుందని ఇండస్ట్రీ పెద్దలు సలహా ఇస్తున్నారు.
భారీ బడ్జెట్ పెట్టి ఆ తర్వాత సతమతం అయ్యే కంటే ముందుగానే సినిమాలకు సంబంధించిన బడ్జెట్ తగ్గించుకుంటే మంచిదని అనుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా తన ‘ఆచార్య’ చిత్రం బడ్జెట్ విషయంలో కోతలు పెట్టాలని స్వయంగా కొరటాల శివకు సూచించారట. సాంకేతిక నిపుణులు మరియు ఇతర నటీనటులు అవసరం ఉన్నంత వరకే తీసుకుని ఎక్కువ షూటింగ్ రోజులు పెట్టకుండా తక్కువ రోజుల్లోనే సినిమాను ముగించేలా చూడాలంటూ దర్శకుడికి చిరంజీవి సూచించాడట.
ఆచార్య చిత్రంను నిరంజన్ రెడ్డి మరియు రామ్ చరణ్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సినిమాకు భారీ అంచనాలున్నా భారీ బడ్జెట్ పెడితే పెద్దగా ఉపయోగం ఉండదనే ఉద్దేశ్యంతో చిరంజీవి ఈ సూచన చేసినట్లుగా తెలుస్తోంది. చిరంజీవితో పాటు ఈ చిత్రంలో చరణ్ కూడా నటించబోతున్నాడు. అయినా కూడా బడ్జెట్ విషయంలో చిరంజీవి జాగ్రత్తలు తీసుకోవడం ఆయన ముందు చూపుకు నిదర్శణంగా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.