ప్రస్తుత పరిస్థితుల్లో పౌరాణిక సినిమాలు చేయడం అసాధ్యం అనుకుంటున్న సమయంలో టాలీవుడ్ జక్కన్న భారీ బడ్జెట్ తో బాహుబలి చిత్రాన్ని తెరకెక్కించి అందరిని అబ్బుర పర్చిన విషయం తెల్సిందే. తెలుగులోనే కాదు ఏ భాషలోనూ మళ్లీ ఇలాంటి అద్బుతం ఆవిష్కరింపబడదేమో అన్న రీతిలో బాహుబలిని ఆయన రూపొందించాడు. బాలీవుడ్ సినిమాలను సైతం తదన్నే స్థాయిలో వసూళ్లు వచ్చాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా.. అసలు విషయం ఏంటీ అంటే విక్రమ్ బర్త్ డే సందర్బంగా ఆయన నటిస్తున్న మహావీర్ కర్ణ సినిమా మేకింగ్ వీడియోను విడుదల చేశారు.
ఆ వీడియోలో విక్రమ్ ను చూస్తుంటే అచ్చు బాహుబలి సినిమాలో ప్రభాస్ ను చూసినట్లుగానే ఉంది. ఆ కాస్ట్యూమ్స్.. లొకేషన్.. స్టైల్.. మేకింగ్ ఇలా అన్ని కూడా బాహుబలి రేంజ్ లో ఉండనున్నట్లుగా అనిపిస్తుంది. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా మహావీర్ కర్ణ చిత్రం షూటింగ్ నిలిచి పోయింది. అయినా విక్రమ్ బర్త్ డే కనుక చిత్ర యూనిట్ సభ్యులు ఈ మేకింగ్ వీడియోను విడుదల చేసి ఫ్యాన్స్ కు ఒక చిన్న ట్రీట్ ఇచ్చారు.
తమిళ విక్రమ్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ కాని తెలుగు నెటిజన్స్ మాత్రం ఈ వీడియోను ట్రోల్ చేస్తున్నారు. బాహుబలిని కాపీ కొడుతున్నారు అంటూ విమర్శలు చేస్తూ ట్వీట్స్ చేస్తున్నారు. ఈమద్య కాలంలో తమిళ ఇంకా తెలుగు ఫ్యాన్స్ మద్య ట్విట్టర్ వార్ చాలా కామన్ అయ్యింది. ప్రస్తుతం మహావీర్ కర్ణ కు సంబంధించిన కాపీ విషయమై ట్వీట్స్ పడుతున్నాయి. బాహుబలిని కాపీ కొట్టి కర్ణను తీయడం ఏంటీ అంటూ దర్శకుడు విమల్ ను నెటిజన్స్ ట్రోల్ చేస్తూ ఉంటే తమిళ నెటిజన్స్ మాత్రం పౌరాణికం ఏది చేసినా బాహుబలినే అనుకోవడం పిచ్చి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.