కరోనా తరువాత బాలీవుడ్ పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఎంతటి స్టార్ సినిమా అయినా సరే బాక్సాఫీస్ వద్ద వెల వెల బోతోంది. కరోనాకు ముందు బాలీవుడ్ సినిమాలకు కోట్ల వర్షం కురిపించిన ప్రేక్షకులు కరోనా తరువాత షాకుల మీద షాకులిస్తున్నారు. కంటెంట్ లేదంటే నిర్ధాక్షిణ్యంగా రిజెక్ట్ చేస్తున్నారు.
దీంతో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన హీరోలు బ్యాక్ టు బ్యాక్ ఇప్పడు డిజాస్టర్ లు ఎదుర్కొంటున్నారు. మధ్య మధ్యలో ఒకటి అర సినిమాలు మెరుపులు మెరిపించినా అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్ లాంటి హీరోల సినిమాలు భారీ డిజాస్టర్లుగా మారి బాలీవుడ్‌కు ఊహించని షాకిచ్చాయి.
ఈ నేపథ్యంలో బాలీవుడ్ కు 2022 అత్యంత డిజాస్టర్ ఇయర్ గా నిలిచింది. ప్రతీ క్రేజీ స్టార్ కు ఈ ఏడాది నైట్ మేర్ గా మారడం గయనార్హం. బాక్సాఫీస్ వద్ద వవదల కోట్లు రాబట్టిన స్టార్ హీరోలు కూడా ఈ ఏడాది తమ సినిమాలతో వందల కోట్లు నష్టాలని తెచ్చిపెట్టారు. అక్షయ్ , అమీర్ ఖాన్ లాంటి హీరోలకు 2022 మర్చిపోలేని ఇయర్ గా మారింది. ఈ జాబితాలో తాజాగా రణ్ వీర్ సింగ్ కూడా చేరిపోయాడు. తను నటించిన లేటెస్ట్ మూవీ `సర్కస్`. రోహిత్ శెట్టి ఈ మూవీని తెరకెక్కరించాడు.
టి.సిరీస్ వారితో కలిసి రోహిత్ శెట్టి నిర్మించి తెరకెక్కించాడు. హిట్ మెషిన్ గా పేరున్న రోహిత్ శెట్టితో కలిసి రణ్ వీర్ సింగ్ చేసిన సినిమా కావడంతో ఈ మూవీతో బాలీవుడ్ కు మళ్లీ కొత్త కళ వస్తుందని అంతా భావించారు. రోహిత్ శెట్టి కూడా బ్లాక్ బస్టర్ హిట్ ని దక్కించుకోబోతున్నామని గొప్పలకు పోయాడు. పూజా హెగ్డే, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ వంటి క్రేజీ హీరోయిన్ లు నటించడం, రణ్ వీర్ సింగ్ డ్యుయెల్ రోల్ చేయడం, దీపిక, రణ్ వీర్ లపై ఓ స్పెషల్ సాంగ్ ని షూట్ చేయడంతో ఓ రేంజ్ లో ఈ మూవీపై ఊహాగానాలు వినిపించాయి.
విలియమ్ షేక్స్పీయర్ ఫేమస్ నవల `ది కామెడీ ఆఫ్ ఎర్రర్స్` ఆధారంగా పీరియాడిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ మూవీ క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 23న విడుదలైంది. ఫస్ట్ షో నుంచే ఈ ఏడాది విడుదలైన సినిమాల్లో అత్యంత డిజాస్టర్ అనిపించుకుంది. రూ.150 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీ ఐదు రోజుల్లో కేవలం రూ. 25 కోట్లు మాత్రమే రాబట్టి డిజాస్టర్ కా బాప్ అనిపించుకుంది. ఈ మూవీతో మేకర్స్ రూ. 125 కోట్ల మేర నష్టపోయారంటే `సర్కస్` ఏ రేంజ్ డిజాస్టర్ రో అర్థం చేసుకోవచ్చు.
మొదటి రోజే డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకున్న `సర్కస్` ఏ దశలోనూ సత్తా చాటలేక దారుణ ఫలితాన్ని రాబట్టింది. దీంతో టీమ్ చేతులెత్తేసింది. ఇంకా ప్రమోషన్స్ అంటూ ఖర్చు చేసి లాభం లేదని సైలెంట్ అయిపోయింది. ఇదిలా వుంటే జనవరిలో రిలీజ్ కానున్న సినిమాల పరిస్థితి ఏంటని, బాయ్ కాట్ ట్రెండ్ పీక్స్ కి చేరిన నేపథ్యలో జనవరి 25న రిలీజ్ కి రెడీ అవుతున్న `పఠాన్` ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కోనుందనే కామెంట్ లు వినిపిస్తున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.