నాని అండ్ నాగ్.. ఓ కాలనీ

Update: 2018-04-29 06:30 GMT
టాలీవుడ్ లో ప్రస్తుతం మల్టీస్టారర్ సినిమాల హంగామా మొదలైంది. ఓ వైపు వెంకటేష్ - వరుణ్ మరో వైపు నాగ్ - నాని. ఈ V2 - N2 కాంబినేషన్ పై ప్రస్తుతం అంచనాలు భారీగా పెరిగాయి.  N2 విషయానికి వస్తే.. నాగార్జున- నాని కెరీర్ లో ఎప్పుడు లేని విధంగా ఈ సినిమా ఉండబోతోంది. దర్శకుడు ఆదిత్య సినిమా కాన్సెప్ట్ మీద చాలా నమ్మకంతో ఉన్నాడు. ఇద్దరు మంచి మార్కెట్ ఉన్న హీరోలే కావడంతో బడ్జెట్ కూడా గట్టిగానే పెడుతున్నారు.

కథలో అవసరమైన కొన్ని మేజర్ సెట్స్ ని దర్శకుడు భారీగా ప్లాన్ చెసుకున్నాడట. నిర్మాత అశ్వినిదత్ కూడా ఏ మాత్రం తగ్గకుండా ఉన్నతంగా ఉండేలా సినిమాను నిర్మిస్తున్నారు. అసలు మ్యాటర్ లోకి వస్తే..  సినిమా కోసం ఒక భారీ కాలనీని సెట్ వేస్తున్నారు. గత నెల నుంచి ఆ సెట్ నిర్మాణ పనులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అందుకోసం దాదాపు కోటి రూపాయలని ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ షెడ్యూల్ స్టార్ట్ చేయనున్నారట.

ఇక మే 2 నుంచి ఒక చిన్న షెడ్యూల్ ని స్టార్ట్ చేసి తొందరగా వర్క్ ఫినిష్ చెయ్యాలని అనుకుంటున్నారు. నాని కూడా తనకు సంబంధించిన సీన్స్ ని అప్పుడే స్టార్ట్ చేయనున్నాడు. ఇక నాగార్జున మాత్రం కొంచెం లెట్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. మే10న దర్శకుడు ఆయనకు సంబంధించిన సన్నివేశాలు తెరకెక్కించేలా ప్లాన్ చేసుకున్నాడు. రష్మీక మంధాన -ఆకాంక్ష సింగ్ ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు.



Tags:    

Similar News