దసరా సందర్బంగా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రతీ సంవత్సరం అలాయ్ బలాయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కానీ ఈసారి జరిపిన ఈ వేడుక పెంటపెంటగా మారింది. ఈ వేడుకు దత్తన్న స్వయంగా వెళ్లి ఇద్దరు ప్రముఖులను ఆహ్వానించారు. వారిలో ఒకరు సినీ ఇండస్ట్రీకి చెందిన మెగాస్టార్ చిరంజీవి కాగా..మరొకరు ప్రవచనాలు చదివే గరికపాటి. అయితే చిరుపై గరికపాటి ఓ విషయంలో అసహనానికి గురయ్యాడు. ఆ తరువాత చిరు ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ చిరు తమ్ముడు నాగబాబు ట్వీట్ తో ఈ విషయం పెద్దదిగా మారబోతుంది. మొత్తంగా మెగాస్టార్ ఫ్యాన్స్ వర్సెస్ బ్రహ్మణ సంఘాలు అనే కాడికి మారాయి.
ఇటీవల నిర్వహించిన 'అలాయ్ బలాయ్' కార్యక్రమంలో చిరు పాల్గొన్నాడు. అయితే చిరు ఫ్యాన్స్ కు ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తున్న విషయం అందరికీ తెలిసిందే. దీంతో ఆయన కొందరు ఫ్యాన్స్ తో ఫొటోలు దిగుతున్నాడు. ఈ క్రమంలో అక్కడే వేదికపై ఉన్న గరికపాటి నరసింహారావు 'మీ ఫొటో షేషన్ ఆపితే.. నేను ప్రవచనాలు మొదలుపెడుతా.. లేకుండా వెళ్లిపోతా..' అని ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. దీంతో చిరు ఫొటో షేషన్ ఆపి గరికపాటి పక్కకు వచ్చి కూర్చున్నారు. ఆ తరువాత యధావిధిగా అలాయ్ బలాయ్ కార్యక్రమం కొనసాగింది.
అయితే చిరుపై ఘాటు వ్యాఖ్యలు చేసిన గరికపాటి పై నాగబాబు సంచలన ట్వీట్ చేశాడు. చిరంజీవి ఇమేజ్ చూస్తే ఈ పాటి వాడికైనా ఆ పాటి అసూయ కలుగుతుంది... అని సెటైర్ వేశాడు. అటు చిరంజీవి ఫ్యాన్స్ సైతం మెగాస్టార్ కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో బ్రాహ్మణ సంఘాలు రంగంలోకి దిగాయి. ప్రవచనాలు చెప్పే గరికపాటికి, సినిమాలతో వ్యాపారం చేసుకునే వ్యక్తికి పోలీకేంటి అంటే ఫైర్ అవుతున్నారు. దీంతో మెగాస్టార్ ఫ్యాన్స్ వర్సెస్ బ్రహ్మణ సంఘాల మధ్య కోల్డ్ వార్ సాగుతోంది.
ఈ క్రమంలో కొందరు విశ్లేషణకు చిన్న విషయాన్ని ఎందుకు పెద్దదిగా మార్చుకుంటున్నారని అంటున్నారు. అయితే చిరంజీవి ఎక్కడికి వెళ్లినా ఫ్యాన్స్ చుట్టుముట్టే విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో గరికపాటి కాస్త మర్యాదగా 'ఫొటో సేషన్ ఆపండి.. చిరంజీవి గారూ.. ' అని అంటే బాగుండేది. కానీ దురుసుగా మాట్లాడడంతో పాటు నేను వెళ్లిపోతా.. అంటూ అనడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇక గరికపాటి అంతటి వ్యాఖ్యలు చేసినా ఆ తరువాత చిరు మర్యాదగానే ప్రవర్తించారు.
గరికపాటిని ప్రత్యేకంగా భినందించాల్సిన అవసరం ఉందన్నారు. అంతేకాకుండా వయసుతో పాటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన బిరుదుల్లోనూ చిరంజీవి పెద్దస్థాయే. గరికపాటి పద్మశ్రీ బిరుదు తీసుకుంటే చిరంజీవి పద్మవిభూషన్ అందుకున్నారు. ఇలాంటి వ్యక్తికి మర్యాద ఇవ్వాల్సిన అవసరం లేదా.. అని అంటున్నారు.
మరికొందరు మాత్రం రాష్ట్రంలో ఎలాంటి సమస్యలు లేనట్లు.. ఇద్దరి వ్యక్తులకు సంబంధించిన విషయాన్ని కుల సంఘాల వరకు వెళ్లకుండా ఉండాలని అంటున్నారు. ఎందుకంటే మర్యాదలో లోపం ఉంటే వారిద్దరు మాట్లాడుకుంటే సరిపోద్ది..అనవసరంగా మిగతా వారు జోక్యం చేసుకోకుండా ఉంటే మంచిదని అంటున్నారు. ఇప్పటికైనా ఈ విషయాన్ని విడిచిపెట్టి వేరే విషయాల గురించి ఆలోచించాలని కొందరు కోరుతున్నారు..
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.