హీరోగా ఛాన్సిస్తామంటే ఎవరైనా వద్దనుకుంటారా? కానీ ఆ కామెడీ హీరో ససేమిరా అంటున్నాడు. అసలు హీరో అన్న మాటెత్తితే చాలు కంపరమెత్తిపోతున్నాడు. అసలు హీరోగా నటించేందుకు ఎంతమాత్రం ఆసక్తి చూపించడం లేదు. అనుభవ పాఠమో.. లేక ఇంకేదైనానో మొత్తానికి ఆయన తీరు ప్రస్తుతం పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది.
టాలీవుడ్‌లో అదొక భారీ ప్రొడక్షన్ కంపెనీ. అందులో సినిమా చేయాలని చాలా మంది హీరోలు ఎదురు చూస్తుంటారు. కొంత మంది ఆ సంస్థలో సినిమా చేస్తేనే చాలని భావిస్తుంటారు. అలాంటి సంస్థ పిలిచి ఆఫరిస్తే ఓ కామెడీ హీరో పోజు కొడుతున్నాడని తెలిసింది. భారీగా పారితోషికం ఇస్తామని సదరు సంస్థ వెంటపడుతున్నా కామెడీ హీరో మాత్రం తప్పించుకు తిరుగుతున్నాడట. ఎప్పుడు ఫోన్ చేసినా తను వేరే పనుల్లో బిజీగా వున్నానని.. ఇప్పుడు ఖాళీ లేదని మాటలు చెబుతూ టైమ్ పాస్ చేస్తున్నాడట.
కమెడియన్ గా దశాబ్ద కాలం పాటు ఆకట్టుకుని బ్రహ్మానందం- అలీ తరహాలో ఆ తరువాత తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న సదరు కమెడియన్ కం హీరో ఆ తరువాత `హీరోగా మాత్రమే` అనే షరతు పెట్టుకుని కామెడీ వేశాలకు దూరమయ్యాడు. అయితే హీరోగా కొన్ని హిట్లు వచ్చినా కాలక్రమంలో దురదృష్టం వెంటాడింది. హీరోగా పప్పులేవీ ఉడక్కపోవడంతో మళ్లీ దారిలేక స్నేహితుడి అండతో కామెడీ క్యారెక్టర్లతో సరిపుచ్చుతున్నాడు. ఈ క్రమంలో ఓ భారీ నిర్మాణ సంస్థ మళ్లీ హీరోగా వేషం ఇస్తాం అని వెంటపడుతున్నా ఎందుకనో ముఖం చాటేస్తున్నాడు. అతను ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడో ఎవరికీ అర్థం కావడం లేదట. పారితోషికం ఒక్కటే కాదు.. ఇంకేదో రియలైజేషన్ ఇందుకు కారణం అంటూ మాట్లాడుకుంటున్నారు.