43 భాష‌ల్లో ప్రిన్స్ బ‌ర్త్ డే విషెస్ ...వైర‌ల్!

Update: 2018-08-06 10:38 GMT
న‌ట శేఖ‌ర కృష్ణ న‌ట‌వార‌సుడిగా టాలీవుడ్ లో అడుగుపెట్టిన మ‌హేష్ బాబు....త‌న‌కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. బాల‌న‌టుడిగా తెరంగేట్రం చేసిన బుర్రిపాలెం బుల్లోడి త‌న‌యుడు....అన‌తి కాలంలోనే బ‌డా స్టార్ గా ఎదిగాడు. టాలీవుడ్ ప్రిన్స్ గా అభిమానులు పిలుచుకునే మహేష్ ప్ర‌స్తుతం త‌న 25వ చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. మ‌రో మూడు రోజుల్లో త‌న 43వ పుట్టిన రోజు జ‌రుపుకోబోతోన్న మ‌హేష్ కు బ‌ర్త్ డే విషెస్ తెలిపేందుకు ఆయ‌న అభిమానులు వినూత్న త‌ర‌హాలో ప్ర‌య‌త్నిస్తున్నారు. తాజాగా, మ‌హేష్ బాబు హార్డ్ కోర్ ఫ్యాన్స్ రూపొందించిన డీపీ ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. 43 అంతర్జాతీయ భాషల్లో మ‌హేష్ కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలుపుతూ రూపొందించిన ఆ కామ‌న్ డీపీని ప్ర‌ముఖ నిర్మాత బీఏ రాజు ట్విట్ట‌ర్ లో షేర్ చేశారు.

మహేష్ 25వ‌ చిత్రం ఫస్ట్ లుక్ ను ఈ నెల 9వ తేదీన విడుదల చేయ‌బోతోన్న సంగ‌తి తెలిసిందే. అదే రోజు టైటిల్ ను కూడా రివీల్ చేయ‌బోతున్నారు. అదే రోజున ప్రిన్స్ బర్త్ డే రాబోతుండడంతో ఫ్యాన్స్ ఎగ్జైటింగ్ గా ఉన్నారు. దీంతో, గ‌త రెండు మూడు రోజులుగా రకరకాల లోగోస్ తో ఎంబ్లెమ్స్ తో డిజైన్స్ తో సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నారు. అయితే, ఆగ‌స్టు 9న మ‌హేష్ అభిమానులు ....ఆయ‌న బ‌ర్త్ డే సెల‌బ్రేట్ చేసుకునేందుకు మ‌హేష్ డై హార్డ్ ఫ్యాన్స్ అయిన‌ ఏఏ క్రియేష‌న్స్ వారు ఓ కామ‌న్ డీపీని రూపొందించారు. ఆ డీపీని ఓ ప‌జిల్ లాగా 25 పార్ట్స్ చేశారు. యూఎస్ ఏ తోపాటు చెన్నై - ఏపీ - తెలంగాణ‌లోని 25 ప్రాంతాల్లో మ‌హేష్ అభిమానులు...ఒక్కో పార్ట్ ను రివీల్ చేశారు. త‌న 43వ పుట్టిన రోజు జ‌రుపుకోబోతోన్న ప్రిన్స్ కు 43 అంతర్జాతీయ భాషల్లో జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు చెబుతూ రూపొందించిన కామ‌న్ డీపీ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. 900మంది ఫ్యాన్స్ ఫొటోల‌తో పాటు....43 అంత‌ర్జాతీయ భాష‌ల్లో ప్రిన్స్ కు బ‌ర్త్ డే విషెస్ తెలుపుతూ ఆ పోస్ట‌ర్ ను రూపొందించారు. ప్రిన్స్ న‌టించిన 24 సినిమాల పోస్ట‌ర్ లు - ఫ్యాన్స్ తో మ‌హేష్ దిగిన 900 ఫొటోలు - 43 అంత‌ర్జాతీయ భాష‌ల్లో ప్రిన్స్ కు విషెస్ ల‌తో  కామ‌న్ డీపీని రూపొందించారు. బీఏ రాజు ఆ డీపీని ట్వీట్ చేసి...మ‌హేష్ అభిమానుల‌ను అభినందించారు. ప్ర‌స్తుతం  ఆ డీపీ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.
Tags:    

Similar News