మహమ్మారీ భయాల నడుమ థియేట్రికల్ రిలీజ్ ల కంటే ఓటీటీ రిలీజ్ లకు నిర్మాతలు ప్రాధాన్యతనిస్తున్నారు. అలా రిలీజైనదే బాలీవుడ్ రీమేక్ మూవీ కూలీనంబర్ 1. వరుణ్ ధావన్ - సారా అలీఖాన్ జంటగా ఈ మూవీ తెరకెక్కి ఇటీవల అమెజాన్ ప్రైమ్ లో రిలీజైంది.
కానీ ఈ సినిమా ఔట్ డేటెడ్ కాన్సెప్ట్ .. చెత్త కామెడీ నేటి జనరేషన్ ని మెప్పించడంలో చతికిలబడడం చర్చకు వచ్చింది. ఈ సినిమాకి మేకర్స్ ఆశించిన స్పందన రావడం లేదు. ప్రఖ్యాత ఐఎండీబీలో రెండవ అత్యల్ప రేటింగ్ తో రేసులో వెనకబడింది.
అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన నాలుగు రోజుల్లోనే కూలీ నెం: 1 కి ఐఎండీబీలో 1.3 రేటింగ్ లభించింది. సడక్ 2 కి 1.1 / 10 రేటింగుతో అతి తక్కువ స్కోరుతో ఉండగా.. ఆ తర్వాత ఈ సినిమానే నిలిచింది. కాలం చెల్లిన సీన్స్ అక్కరకు రాని సన్నివేశాలతో ఈ మూవీ చెత్త చిత్రంగా నిలిచింది. `కూలీ నెం: 1` 1995 హిందీ చిత్రానికి రీమేక్. ఇది 1991 వెంకటేష్ నటించిన తెలుగు చిత్రానికి రీమేక్. అప్పటివి రెండూ హిట్లు అయితే ఇప్పటి సినిమా ఫ్లాపైంది.