పెళ్లికాకుండా నే రెండ‌వ బిడ్డ‌ కి జ‌న్మ‌నిస్తున్న జంట‌!

Update: 2023-04-30 11:00 GMT
కొంద‌రు సెల‌బ్రిటీల జీవితాల్లో పెళ్లి కాకుండానే త‌ల్లిదండ్రులు కావ‌డం స‌హ‌జంగా మారిపోయింది. ఇప్ప‌టి కే అమీ జాక్సన్ స‌హ‌జీవ‌నం చేసి ఓ బిడ్డ‌ కు జ‌న్మ‌నిచ్చిన సంగ‌తి తెలిసిందే. అంత‌కు ముందు తెలుగు లో ఓ స్టార్ హీరో కూడా ఇలాగే పెళ్లి కాకుండానే పిల్ల‌ల్ని క‌న్నాడు. ఆ త‌ర్వాత పెళ్లి చేసుకుని కొన్ని ర‌కాల విమ‌ర్శ‌ల‌కు చెక్ పెట్టారు.  ఆత‌ర్వాత ఆ బంధం కూడా వీగిపోయిన సంగ‌తి తెలిసిందే.

ఆ ర‌కంగా తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో కూడా ఈ ర‌క‌ మైన క‌ల్చ‌ర్  ఉంద‌న్న సంగ‌తి అంద‌రికీ అర్ధ‌మైంది. ఈ నేప‌థ్యంలో తాజాగా మ‌రో బాలీవుడ్ జంట రెండ‌వ సారి పెళ్లి కాకుండానే త‌ల్లిదండ్రులు అయిన‌ట్లు తెలుస్తుంది. అర్జున్ రాంపాల్- మోడ‌ల్ గార్బెల్లా  కొంత కాలంగా రిలేష‌న్ షిప్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే. తాజాగా గార్బెల్లా బేబి బంప్ ఫోటోలు నెట్టింట హ‌ల్చ‌ల్ చేస్తున్నాయి.

మ‌రికొన్ని నెల‌ల్లో గార్బెల్లా పండంటి బిడ్డ‌ కు జ‌న్మ‌నివ్వ‌బోతుంద‌న్న సంగ‌తి బ‌య‌ట‌కు వ‌చ్చింది. దీంతో బాలీవుడ్ సెల‌బ్రిటీలు ఆ జంట‌కు శుభాకాంక్ష‌లు చెబుతున్నారు. కాజ‌ల్..అమీ జాక్సన్ ముందుగా స్పందించి విషెస్ తెలియ‌జేసారు. అర్జున్ రాంపాల్ కి ఇప్ప‌టికే వివాహ‌మైంది. 1998 లో మెహ‌ర్ ను వివాహం చేసుకున్నారు. ఆ త‌ర్వాత కొన్నాళ్ల‌ కి ధాంప‌త్య జీవితంలో క‌ల‌త‌లు చోటు చేసుకోవ‌డంతో 2019 లో విడిపోయారు.

అటు పై గార్బెల్లా కి ద‌గ్గ‌ర య్యారు. ముందు స్నేహితుల‌య్యారు. ఆ త‌ర్వాత ప్రేమికులుగా మారారు. ఇప్పుడు పెళ్లి కాకుండా రెండ‌వ సారి త‌ల్లిదండ్రులు అవ్వ‌బోతున్నారు. ఇప్ప‌టికే ఈ జంట‌కు ఓ బాబు జ‌న్మించాడు. తొలిసారి బాబు పుట్టిన ప్పుడే ఇద్ద‌రి పై చాలా నెగిటివ్ క‌థ‌నాలు వెలువ‌డ్డాయి. పెళ్లి కాకుండానే ఇవేం ప‌నులంటూ విమ‌ర్శ‌లొ చ్చాయి.

దీంతో పెళ్లి చేసుకుంటార‌ని ప్ర‌చారం సాగింది. కానీ వాటిని ఏమాత్రం ప‌ట్టించుకోకుండా ప్ర‌యా ణాన్ని కొన‌సాగించారు. ఇప్పుడా జంట‌ పై ఎలాంటి విమ‌ర్శ‌లు లేవు. ఎవ‌రి జీవితాల్లో వారు సంతోషంగా ఉన్నారు. అర్జున్ రాంపాల్ సినిమాల‌ తో బిజీగా ఉంటున్నారు.

Similar News