పెళ్లికి ముందు స‌హ‌జీవ‌నంలో జంట‌లు!

Update: 2022-08-02 03:30 GMT
లివ్-ఇన్ రిలేషన్ షిప్ (స‌హ‌జీవ‌నం) అనే కాన్సెప్ట్ ని నేటి యువ‌త‌కు ప‌రిచ‌యం చేయ‌న‌వ‌స‌రం లేదు. సెల‌బ్రిటీ వ‌ర‌ల్డ్ లో ఇది చాలా కామ‌న్. చాలా కాలంగా స్టార్ క‌పుల్స్ అనుస‌రించేదే. అయితే వీటిలో కొన్ని లివ్-ఇన్ సంబంధాలు వివాహంగా మారాయి. కొన్నాళ్ల‌కు విఫలమయిన‌వి ఉన్నాయి.  అలాంటి జంట‌ల గురించి ముచ్చ‌టించాల్సి వస్తే..

అమీర్ ఖాన్-కిరణ్ రావ్ పెళ్లికి ముందు కలిసి జీవించారు. తాము మారాలని నిర్ణయించుకున్నప్పుడే కిరణ్ రావు విష‌యంలో సీరియస్ గా వ్యవహరించడం ప్రారంభించాన‌ని పెళ్లికి ముందు ఏడాదిన్నర పాటు కలిసి జీవించామని అమీర్ చెప్పాడు. ఇటీవ‌ల ఈ జంట బ్రేక‌ప్ గురించి తెలిసిన‌దే.

కరీనా కపూర్ ఖాన్ -సైఫ్ అలీ ఖాన్ పెళ్లికి ముందు కొన్నేళ్ల పాటు స‌హ‌జీవ‌నం చేసారు. 2012లో పెళ్లికి ముందు సైఫ్ తో లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్నట్లు కరీనా వెల్లడించింది.

సైఫ్ అలీఖాన్  సోద‌రి సోహా అలీఖాన్ తో తన లివ్-ఇన్ రిలేషన్ షిప్ భాగస్వామిని బాగా తెలుసుకోవటానికి అర్థం చేసుకోవడానికి సహాయపడిందని ఖునాల్ చెప్పాడు. అది చివరికి వారి వివాహానికి సహాయపడింది. ఖునాల్ కంటే ముందు సోహా ద‌క్షిణాది హీరో సిద్ధార్థ్ తో స‌హ‌జీవ‌నం చేసిన‌ట్టు క‌థ‌నాలు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.

విరాట్ కోహ్లీ- అనుష్క శర్మ  జంట పెళ్లికి ముందు దోబూచులాట గురించి తెలిసిందే. కొన్నేళ్ల పాటు సీక్రెట్ డేటింగ్ కొన‌సాగించాక విరాట్ పెళ్లాడాడు. 2017లో పెళ్లికి ముందు విరాట్ - అనుష్క కలిసి జీవించారన్న‌ది అంద‌రికీ తెలిసిన నిజం.

నాగ‌చైత‌న్య - స‌మంత జంట పెళ్లికి ముందు ఒక ఇంట్లో స‌హ‌జీవ‌నం సాగించిన‌ట్టు క‌థ‌నాలొచ్చాయి. ఒక‌సారి బాల్క‌నీలో ఈ జంట రొమాన్స్ కి సంబంధించిన ఫోటోలు లీక‌వ్వ‌డం క‌ల‌క‌లం రేపింది. అనంత‌రం ఆ ఇద్ద‌రికీ పెళ్ల‌య్యింది. నాలుగేళ్ల కాపురం అనంత‌రం ఈ జంట విడిపోతున్న‌ట్టు ప్ర‌క‌టించ‌డం అభిమానుల‌ను తీవ్ర నిరాశ‌కు గురి చేసింది.

బోనీ శ్రీదేవితో ప్రేమలో పడినప్పుడు మోనా శౌరీ కపూర్ ను వివాహం చేసుకున్నాడు. కానీ సీక్రెట్ కాపురం పెట్ట‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. అనంత‌రం శ్రీ‌దేవితో మోనా వైరం జీవితాంతం కొన‌సాగింద‌ని చెబుతారు. మోనా కుమారుడు అర్జున్ క‌పూర్ కూడా శ్రీ‌దేవితో అంత స‌ఖ్య‌త‌గా లేక‌పోవ‌డంపై క‌థ‌నాలొచ్చాయి. గ్లామ‌ర్ అండ్ గ్లిజ్ రంగంలో ఇలా ఎంద‌రో ఉన్నారు. బ‌య‌టికి వినిపించ‌నివి క‌నిపించ‌నివి ఎన్నో ఉన్నాయి. అయితే పాపుల‌ర్ జంట‌లు గా పైన ఉద‌హ‌రించిన అర‌డ‌జ‌ను క‌పుల్స్ ఓ వెలుగు వెలిగిన సంగ‌తి విధిత‌మే.
Tags:    

Similar News