కరోనా మహమ్మారితో సమాజంలో ఎన్నో మార్పులు చూసాం. కరోనా వైరస్ దెబ్బకు ఎమర్జెన్సీ అంటే ఏంటో అర్థమైంది. ముఖ్యంగా వైరస్ లతో ఎంత జాగ్రత్తగా ఉండాలో పాఠాలు నేర్చుకున్నాం. ఇక టాలీవుడ్ విషయానికి వస్తే దర్శక నిర్మాతలు హీరోల్లో సైతం ఎన్నో మార్పులు ఇప్పుడు చూస్తున్నాం. కరోనా తొలి వేవ్ సమయంలో అవగాహన లోపంతో కొన్ని తప్పిదాలు జరిగాయి.
అటుపై ఊహించని విధంగా సెకెండ్ వేవ్ లో డెల్టా వేరియేంట్ తొలి వేవ్ ని మించి దాడి చేసింది. ఇప్పుడు థర్డ్ వేవ్ ముందుంది. ఈ నేపథ్యంలో దర్శక నిర్మాతలు ప్రతిదీ చాలా పక్కాగా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. తొలి వేవ్ సమయంలో షూటింగ్ లు పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీగా ఉన్న సినిమాలు లాక్ డౌన్ అనంతరం రిలీజ్ చేసారు.
మరికొన్ని సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు అదే పంథాలో నిర్మాతలున్నారు. అక్టోబర్ నుంచి థర్డ్ వేవ్ వస్తుందన్న ప్రచారం నేపథ్యంలో నిర్మాతలు ఓ ముందస్తు ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. సెకెండ్ వేవ్ ప్రారంభానికి ముందు మొదలైన సినిమాలన్నీ ఆగస్టు లోపు షూటింగ్ లు పూర్తి చేసేలా నిర్మాతలు ప్లాన్ చేరుకుని ముందుకెళ్తున్నారు.
హీరోలు దర్శకులకు సమయం విలువ కూడా బాగా తెలుసొచ్చిందనే టాక్ వినిపిస్తోంది. ఆన్ సెట్స్ లో ఎక్కడా సమయం వృథా చేయకుండా వీలైనంత త్వరగా ఆ రోజు షూటింగ్ పూర్తి చేసి ఇంటికెళ్లిపోతున్నారు. మరికొంతమంది సెలబ్రిటీలు బాహాటంగానే కరోనా టైమ్ విలువ మనిషి విలువ తెలిసొచ్చేలా చేసిందంటున్నారు. మునుపటితో పోలిస్తే ఇండస్ట్రీ మనుషుల ఐడియాలజీని ఇది చాలా ప్రభావితం చేసింది. క్రమశిక్షణను పెంచింది. సినిమాల షూటింగులతో పాటు రిలీజ్ ప్లాన్ ని సవ్యంగా సాగేలా డిజైన్ చేసిందన్న టాక్ వినిపిస్తోంది.