తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం జైలర్ సినిమా తో పాటు కూతురు ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో 'లాల్ సలాం' అనే సినిమాలో నటిస్తున్నాడు. లాల్ సలాం సినిమాలో రజినీకాంత్ హీరోగా కాకుండా ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన చిత్రీకరణ జరుగుతోంది.
విష్ణు విశాల్ హీరోగా లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ లో రూపొందుతున్న లాల్ సలాం సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న విషయం తెల్సిందే. ముంబయి లో సినిమాకు సంబంధించిన క్రికెట్ సన్నివేశాల చిత్రీకరణ జరుపుతున్నట్లుగా తెలుస్తోంది.
ఈ షెడ్యూల్ లో రజినీకాంత్ తో పాటు క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్ కూడా పాల్గొంటున్నాడు.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం లాల్ సలాం సినిమాలో కపిల్ దేవ్ కొన్ని నిమిషాల పాటు కనిపిస్తాడట. రజినీకాంత్ మరియు కపిల్ దేవ్ కాంబోలో సన్నివేశాలు ఉంటాయని తెలుస్తోంది.
సినిమాలో కపిల్ దేవ్ తన ఒరిజినల్ పాత్రలో అంటే కపిల్ దేవ్ గానే కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. సినిమా సూపర్ స్టార్.. క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్ లు ఇలా ఒకే ఫ్రేమ్ లో కనిపించడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కపిల్ దేవ్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్లుగా ఈ ఫోటోను షేర్ చేసిన రజినీకాంత్ స్వయంగా పేర్కొన్నాడు. క్రికెట్ లెజెండ్ అయిన కపిల్ దేవ్ గతంలో కూడా కొన్ని సినిమాల్లో గెస్ట్ గా కనిపించాడు. ఇప్పుడు లాల్ సలాం సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.