చెన్నై తుఫాన్.. కుర్ర హీరో ఇంటికి డ్యామేజ్

Update: 2016-12-14 05:32 GMT
రీసెంట్ గా వర్దా తుఫాన్ చెన్నైను కుదిపేసిన సంగతి తెలిసిందే. తుఫాన్ తీవ్రత తగ్గింది కానీ.. చెన్నై నగరం మాత్రం పడిపోయిన చెట్లతో అడవి మాదిరిగా మారిపోయింది. ఇందులో తెలుగు హీరో సందీప్ కిషన్ కి కూడా కొంతమేర నష్టం వాటిల్లింది.

సరిగ్గా సందీప్ కిషన్ ఇంటిలోకి వెళ్లేందుకు ఎంట్రన్స్ గేటు.. గోడపై పెద్ద వృక్షం కూలిపోయింది. 'సోమవారం నాడు పెనుగాలులకు చెట్టు మా ఇంటి మెయన్ గేటుపై పడిపోయింది. ఇంట్లోకి వెళ్లేందుకు కూడా వీలు లేకుండా అడ్డు పడి బ్లాక్ చేసేసింది. ఎంతో కష్టం మీద మేం ఇంట్లోంచి బయటకు వచ్చాం. మా ఇంటి దగ్గర్లో ఉండే కొందరు కుర్రాళ్లతో కలిసి దాన్ని తొలగించాం. చెట్టు మొదలును ముక్కలుముక్కలుగా కట్ చేసి అఫ్పుడు తీసేయాల్సి వచ్చింది. ఇది చాలా పెద్ద పనే' అంటున్నాడు సందీప్ కిషన్.

అయితే.. కష్టసమయంలో కుటుంబంతో ఉన్నందుకు మాత్రం ఆనందంగా ఉందని అన్నాడు. 'ఒత్తిడిలో ఉన్నపుడు కుటుంబంతో ఉండడం చాలా ముఖ్యం. ఇలాంటి కష్ట సమయాలు కొన్ని సార్లు మాత్రమే వస్తాయి. ఈ టైంలో నేనే వంట చేసి పెట్టాను. నేను పెట్టే కాఫీ అమ్మ.. చెల్లి.. మేనేజర్ కు కూడా చాలా ఇష్టం' అంటున్నాడు సందీప్ కిషన్.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News