పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ `సాహో` తరువాత రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్ లో చేస్తున్న మూవీ `రాధేశ్యామ్`. .. `జిల్` తరువాత దాదాపు ఆరేళ్ల విరామం తీసుకున్న దర్శకుడు రాధాకృష్ణకుమార్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. దాదాపు కొన్నేళ్ల పాటు ఈ చిత్ర కథ కోసం శ్రమించామని, ఇండియన్ సినీ చరిత్రలో ఈ స్థాయిలో స్టోరీపై రీసెర్చ్ చేసి తీసిన సినిమా ఏదీ లేదని దర్శకుడు రాధాకృష్ణకుమార్ ఇటీవల వెల్లడించి ఈ ప్రాజెక్ట్ పై హైప్ ని క్రియేట్ చేశారు.
పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ ప్రభాస్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో వింటేజ్ ప్రేమకథగా తెరకెక్కింది. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ సినిమాపై అంచనాల్ని మరింతగా పెంచేసింది. ఇటలీ నేపథ్యంలో రూపొందిన ఈ మూవీలో ప్రభాస్ పాల్‌మిస్ట్ గా నటించారు. ప్రేమించిన ప్రేమే ప్రేమని అంతం చేస్తే అనే కాన్సెప్ట్ నేపథ్యంలో సరికొత్త కథగా ఈ మూవీని వింటేజ్ లవ్ స్టోరీగా తెరకెక్కించారు. ఇటలీలో కీలక ఘట్టాలని చిత్రీకరించిన ఈ చిత్ర బృందం ప్రధాన సన్నివేశాలని ఫలక్ నూమా ప్యాలెస్ లో ప్రత్యేకంగా చిత్రీకరించారు.
ఆ తరువాత మరో ప్యాలెస్ సెట్ ని వింటేజ్ వాతావరణానికి అనుగుణంగా తీర్చిదిద్ది చిత్రీకరించారు. అయితే తాజాగా విడుదల చేసిన ఈ మూవీ ట్రైలర్ చాలా ప్రశ్నలని రైజ్ చేసింది. అంతే కాకుండా ఈ మూవీ కథ ఏంటన్న ఓ ఆసక్తికరమైన విషయాలు తాజాగా బయటికి రావడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా జరిగిన పలు ఆసక్తికర సంఘటనలని మేళవించి ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్టుగా తెలుస్తోంది.
ట్రైలర్ లో చూపించిన ఓడ డావిన్సీ ఓడ అని తెలుస్తోంది. చరిత్రలో డావిన్సీ ఓడ ప్రమాదాన్ని ప్రత్యేకంగా చెప్పుకున్నారు. అలాగే ఇటలీలో మిస్సయిన ట్రైన్ యాక్సిడెంట్ ని కూడా ఇందులో చేర్చి ఓ అందమైన ప్రేమకు అడ్డంకులు సృష్టించిన విధి నేపథ్యంలో ఈ మూవీని అందంగా మలిచారట. ట్రైలర్ లో చూపించిన ఓడ ప్రమాదానికి సంబంధించిన సన్నివేశాలు డావిన్సి ఓడ ప్రమాదాన్ని తలపిస్తున్నాయని, డావిన్సీ ఓడకు రాధేశ్యామ్ కథకు వున్న సంబంధం ఏంటన్నది ఇప్పడు ఆసక్తిని రేకెత్తిస్తోంది.