రజనీకాంత్ అందగాడు కాడు, అద్భుతమైన నటనా చాతుర్యం కూడా మొదట్లో ఏమీ చూపించలేదు. శరీరం రంగు కూడా పూర్తిగా నలుపు. కళ్ళు చాలా చిన్నవి. అయినా సరే సత్తా చాటాడు. నాలుగు దశాబ్దాలుగా తిరుగులేని నటుడిగా, సౌతిండియా సూపర్ స్టార్ గా వెలుగొందుతూనే ఉన్నాడు. రజనీ రికార్డులు ఎవరూ బద్ధలు కొట్టలేనివి. ఆయన కీర్తి ఖండాంతరాలకు పాకింది. ఈ రోజున ఆయన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు విన్నర్. నిజంగా ఆ అవార్డుకు ఆయన అర్హుడే.
ఎందుకంటే రజనీ తనకు వచ్చిన నటనతో అపూర్వ రాగంగల్ మూవీలో తెరంగేట్రం చేశారు. చక్కని శిల్పి దర్శక దిట్ట కె బాలచందర్ చేతిలో పడి శిల్పంగా మెరిసారు. ఆ మీదట తనను తాను దిద్దుకుంటూ ఎన్నో మెట్లు ఎక్కారు. ఈ రోజున ఆయనే నటనకు విశ్వవిద్యాలయంగా మారిపోయారు. ఇంతకీ రజనీ ఏ విషయంలో గొప్ప, ఆయనకు కొందరిలా విరగబడి డ్యాన్సులు చేయడం రాదే. భారీ డైలాగులు కూడా పేజీలకు పేజీలు చెప్పి చప్పట్లు కొట్టించగలరా అంటూ ఉంటారు. కానీ రజనీ పూనకాలు వచ్చినట్లు డ్యాన్స్ చేయనవసరం లేదు. లయబద్దంగా ఆయన కాళ్ళూ చేతులూ కదిపితే అదే అద్భుత నృత్యం అని ఫ్యాన్స్ మురిసిపోతారు.
రజనీ ఒక్కసారి డైలాగ్ చెబితే చాలు, వందసార్లు చెప్పినట్లే . ఆయన కళ్ళు చిన్నవి అయినా అందులో ఉండే మెరుపు చాలు విలన్ భయపడిపోతాడు, హీరోయిన్ ప్రేమలో పడిపోతుంది అంతే. ఇక నటనలో రజనీ ఏ రోజూ తప్పు చేయలేదు. మొత్తం కెరీర్ లో ఏనాడూ వివాదస్పదం కాలేదు. ఆయన నిర్మాతలను, కో ఆర్టిస్టులను టెక్నీషియన్లను చాలా గౌరవిస్తారు. తనకు మొదటి అవకాశం ఇచ్చిన బాలచందర్ ని గురువుగా ఎప్పటికీ భావిస్తారు. అంతేనా తాను బస్ కండక్టర్ గా పనిచేసే రోజుల్లో డ్రైవర్ గా ఉన్న మిత్రుడిని కూడా ఈ రోజుకీ తలచుకుంటారు. తన మూలాలను ఆయన ఎపుడూ మరచిపోలేదు. తాను ఎక్కడ నుంచి వచ్చానో తెలుసుకుని సదా గుర్తుంచుకుని సాగిపోయే రజనీ నిజంగా దాదావే. ఆయనలో నటుడే కాదు, మనిషి ఉన్నాడు, మంచితనం ఉంది. ఆధ్యాత్మికవేత్త ఉన్నాడు. తనను తాను పూర్తిగా ఎరిగిన యోగి ఉన్నాడు.
భావి తరాలు రజనీకాంత్ గురించి తెలుసుకోవాల్సింది చాలానే ఉంది. ఆయనకు ఒక్క భారత రత్న తప్ప అన్ని పౌర పురస్కారాలు దక్కాయీ అంటే అది ఆయన గొప్పతనం. మిగిలిన వారికి ఎందుకు రాలేదూ అంటే ఎవరికి వారు ఆలోచించుకోవాలి. రజనీ అంటే వినయం, ఒదిగి ఉండడం, రజనీ అంటే సూపర్ స్టార్ గా తెర మీద, సామాన్యుడిగా తెరవెనక. అందుకే ఆయన్ని అవార్డులు అన్నీ వరించాయి. అందుకే ఆయన అన్ని తరాలకూ స్పూర్తి అని చెప్పాలి మరి.