పశువాంఛతో ఇష్టారాజ్యంగా వ్యవహరించే మృగాళ్ల గురించి ఓపెన్ గా మాట్లాడటం స్వాగతించాల్సిందే. నోరు మూసుకుంటే.. మరింతగా రెచ్చిపోయే వారికి చెక్ చెప్పేలా.. ఏదైనా చేస్తే దానికి తగ్గ ఫలితం అనుభవించాల్సి ఉంటుందన్న విషయం కామాంధులకు తెలియాల్సిన అవసరం ఉంది.
ఇటీవల కాలంలో తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి నటీమణులు ఓపెన్ అవుతున్నారు. హాలీవుడ్ నుంచి స్టార్ట్ అయిన ఈ ట్రెండ్ ఈ మధ్యనే దేశీయంగా పలువురు ప్రముఖులు తమకు ఎదురైన వేధింపులపై పెదవి విప్పుతున్నారు. తాజాగా బాలీవుడ్ సీనియర్ నటి డైసీ ఇరానీ గుండెలు పగిలే చేదు నిజాన్ని చెప్పారు.
ఆరేళ్ల వయసులోనే తన గార్డియన్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని పేర్కొన్నారు. ఒక టాబ్లాయిడ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. తనకు ఎదురైన దారుణ అనుభవాన్ని పంచుకున్నారు. తానీ విషయం ధైర్యంగా చెప్పటానికి కారణం చాలామంది పిల్లలు ఇండస్ట్రీలో పని చేస్తున్న నేపథ్యంలో వారికి ఆ విషయాలు తెలియాలన్నారు.
తన జీవితంలో తనకు ఎదురైన దారుణ ఘటన గురించి ఆమె వెల్లడించారు. మద్రాసులో జరిగే ఒక షూటింగ్ లో పాల్గొనేందుకు వెళ్లినప్పుడు.. తన గార్డియన్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడన్నారు. "ఒక రోజు రాత్రి హోటల్ రూంలో లైంగిక దాడి చేశాడు. బెల్ట్ తో కొట్టాడు. ఎవరికైనా జరిగిన దారుణాన్ని చెబితే చంపేస్తానన్నాడు. అతనిపేరు నాజర్. అతనిప్పుడు చనిపోయి ఉంటాడు. అతను ప్రముఖ సింగర్ జోరాబాయి అంబాలేవాలికి కావాల్సిన వాడు. స్టార్ ను చేయాలన్న ఉద్దేశంలో మా అమ్మ నన్నీ నరకంలో పడేసింది" అని ఆమె వాపోయారు.
ఛైల్డ్ ఆర్టిస్ట్ గా మరాఠి చిత్రంతో పరిచయమయ్యానని.. ఆ సినిమా షూటింగ్ మద్రాసులో జరిగిందన్నారు. తనను తీసుకొచ్చిన నాజర్ తనపై దారుణానికి పాల్పడినట్లు చెప్పారు. ఆ ఘటన లైట్ గా గుర్తుంది కానీ.. అప్పుడు చచ్చేంద బాధ అనుభవించినట్లు ఆమె చెప్పారు. బెల్ట్ తో కొట్టిన విషయం మాత్రం విజువల్ గా గుర్తుండిపోయిందన్నారు. ఆ తర్వాత రోజు తాను షూటింగ్ కు వెళ్లానని.. ఆ విషయాన్ని తన తల్లికి చెప్పేందుకు కొన్నేళ్ల పాటు సాహసించలేకపోయినట్లు ఆమె చెప్పారు. తర్వాత 15 ఏళ్ల వయసులో ఒక నిర్మాత తనను వేధింపులకు గురి చేసే ప్రయత్నం చేశారన్నారు. వెండితెరపై వెలిగిపోయే తారల వెనుక ఎన్ని కష్టాలు ఉంటాయో డైసీ మాటలు చెప్పకనే చెప్పేస్తాయ్.