జేమ్స్ బాండ్ గా నటించడం కన్నా చావడం మేలని డేనియల్ క్రెయిగ్ మొన్నేదో తమాషాకు అన్నాడనుకున్నాం కానీ.. అతను నిజంగానే తర్వాతి సినిమాలో జేమ్స్ బాండ్ గా నటించట్లేదట. ఐతే అది అతడిష్టం ప్రకారం జరిగిందా.. లేక నిర్మాతలే ఎప్పట్లాగే కొత్త బాండ్ కోసం చూస్తున్నారా అన్నది తెలియదు కానీ.. తర్వాతి బాండ్ సినిమాలో డేనియల్ క్రెయిగ్ హీరోగా నటించట్లేదన్నది మాత్రం ఖాయమట. జేమ్స్ బాండ్ సిరీస్ సినిమాలు తీసే ఇయాన్ ఫిలిమ్స్ కొత్త బాండ్ కోసం చూస్తున్నట్లు హాలీవుడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
పియర్స్ బ్రాస్నన్ తో 2006లో ‘డై అనదర్ డే’ తీశాక.. కొత్త బాండ్ కోసం వెతుకుతున్న ఇయాన్ ఫిలిమ్స్ వాళ్లకు 2004లో తగిలాడు డేనియల్ క్రెయిగ్. ‘క్యాసినో రాయల్’ బాండ్ గా అతడి తొలి సినిమా. ముందు అతణ్ని చూసి ఇతను బాండేంటి అన్నట్లు మాట్లాడారు జనాలు. ఆ సినిమాలో అద్భుతమైన పెర్ఫామెన్స్ తో అదరగొట్టాడు క్రెయిగ్. ఆ తర్వాత అతనే బాండ్ గా క్వాంటమ్ ఆఫ్ సోలెస్ - స్కై ఫాల్ సినిమాలు వచ్చాయి. బాండ్ సిరీస్ లో కొత్త సినిమా ‘స్పెక్టర్’ ఈ నెలలోనే విడుదలవుతోంది.
జేమ్స్ బాండ్ పాత్రలు పోషించిన హీరోల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ అనిపించుకున్న డేనియల్ క్రెయిగ్ ఇక బాండ్ గా కనిపించడన్నది ఆయన అభిమానులకు నిరాశ కలిగించే విషయమే. ఐతే ఏదో ఒక దశలో బాండ్ మారాల్సిందే కాబట్టి తప్పదు మరి. మొత్తానికి డేనియల్ క్రెయిగ్ కు ఇక బాండ్ కష్టాలు తప్పినట్లే అన్నమాట.