ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం ఈ హీరోకే..

Update: 2018-05-28 17:30 GMT

జేమ్స్ బాండ్ 25వ మూవీ షూటింగ్ డిసెంబర్లో ప్రారంభమవుతోంది. 2019 చివర్లో ఈ మూవీ విడుదలయ్యే అవకాశం ఉంది. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ చిత్రానికి అస్కార్ విన్నర్ డాని బోయెల్ దర్శకత్వం వహించబోతున్నారు.  దర్శకుడికి రెమ్యునరేషన్ రూపంలోనే 7 మిలియన్ల పౌండ్స్ అందనున్నట్లు సమాచారం.

ఇప్పటికీ 24 బాండ్ చిత్రాలు వచ్చాయి.. త్వరలోనే 25వ బాండ్ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ బాండ్ చిత్రాల్లో నటించే హీరో డేనియల్ క్రెయిగ్ నటించబోయే చివరి చిత్రం ఇదేనట.. అందుకే ఈ సినిమా కోసం హీరో డేనియల్ తీసుకోబోయే రెమ్యునరేషన్ ప్రపంచంలోనే ఏ హీరోకు ఇవ్వనంత మొత్తమని తెలిసింది... ఈ సినిమాలో నటించేందుకు డేనియల్ 50మిలియన్ పౌండ్స్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట.. మన కరెన్సీ లెక్కల ప్రకారం దాదాపు రూ.448 కోట్లు. ఈ మొత్తం చూసి సినీ ప్రేమికులు షాకవుతున్నారు.   సినిమాల చరిత్రలోనే ఇదే అత్యధిక రెమ్యునరేషన్ అట..

అంతేకాదు.. ఈ సినిమాకు ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా కూడా డేనియల్ కు భాగం ఇస్తున్నారట.. ఈ సినిమా ఒకవేళ హిట్ అయితే డేనియల్  కు లాభాల్లో వాటా కూడా దక్కుతుంది. ఇలా ప్రపంచంలోనే అధిక మొత్తాన్ని పారితోషికంగా తీసుకుంటూ డేనియల్ వార్తల్లో నిలుస్తున్నారు.
Tags:    

Similar News