ఈ 'దర్శకుడు'కి అదే పెద్ద మైనస్..

Update: 2017-08-02 06:07 GMT
సపోజు ఒక సినిమా ఉంది. ఆ సినిమాలో కంటెంట్ అద్భుతంగా ఉండి.. సినిమా రిలీజైన రెండో రోజున దాని గురించి సెల్రబిటీలు అందరూ మాట్లాడితే.. అది వెంటనే కుమార్21 ఎఫ్‌ రేంజ్ సక్సెస్ అవుతుంది. అదే సినిమా గురించి అసలు కంటెంట్ పెద్దగా మాట్లాడకుండా.. కేవలం సెలబ్రిటీలే దాని గురించి తెగ చెబుతుంటే మాత్రం.. ఆ సినిమా ఒక 'దర్శకుడు' సినిమాగా మిగిలిపోతుందా?

ఇప్పుడు వస్తున్న సినిమాల్లో బజ్ దేనికి ఎక్కువగా ఉంటే ఆ సినిమాకే ఓపెనింగులు గట్టిగా వస్తున్నాయి. కాని ఆ బజ్ క్రియేట్ చేయడానికి కంటెంట్ ప్రధాన కారణం అయితేనే ఆ ఓపెనింగులు గట్టిగా ఉండేది. ఉదాహరణకు మన 'దర్శకుడు' సినిమాను తీసుకుంటే.. సినిమా ట్రైలర్ లేదా ఇతర కంటెంట్ కంటే కూడా ఇక్కడ సెలబ్రిటీల హడావుడి ఎక్కువైపోయింది. మొదటగా ఎన్టీఆర్ రావడం.. తరువాత సమంత అండ్ రకుల్ పాటలను రిలీజ్ చేయడం.. రామ్ చరణ్‌ ఆడియో రిలీజ్ చేయడం.. తరువాత బన్నీ ప్రి-రిలీజ్ ఈవెంటుకు రావడం.. ఇవన్నీ హైలైట్ అయిపోతున్నాయి కాని.. అసలు సినిమాలో ఏముంది? కొత్త కుర్రాడు అశోక్ ఎలా ఉన్నాడు? హీరోయిన్ ఈషా ఏమన్నా ఇంప్రెస్ చేస్తుందా? ఈ విషయాలపై ఫోకస్ రావట్లేదు. అలాంటప్పుడు ఈ శుక్రవారం విడుదలవుతున్న సినిమాపై క్రేజ్ ఎలా ఉంటుంది?

గతంలో కుమారి 21 ఎఫ్‌ సినిమా అంటే అప్పటికే రాజ్ తరుణ్‌ ఒక పెద్ద హిట్ కొట్టేసి యంగ్ సెన్సేషన్ అయిపోయాడు. అలాగే సినిమా చూశాక కంటెంట్ అదిరింది.. హెబ్బా పటేల్ మతిపోగొట్టింది.. అందువలన బాగా క్రేజ్ వచ్చేసింది. 'దర్శకుడు' పరిస్థితికి వస్తే.. ఇప్పటికి మాత్రం క్రేజ్ పరంగా జస్ట్ యావరేజే.. రిలీజయ్యాక పరిస్థితి ఏమన్నా మారుతుందేమో చూడాలి.
Tags:    

Similar News