నేచురల్ స్టార్ నాని హీరోగా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిన చిత్రం దసరా. ఈ మూవీ మార్చి 30న రిలీజ్ కాబోతుంది. నాని కెరియర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రంగా ఇది తెరకెక్కింది. శ్రీకాంత్ ఒదేల ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. కీర్తి సురేష్ ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పటికే దసరా ట్రైలర్ ప్రేక్షకుల ముందుకి వచ్చి మూవీ మీద అంచనాలు పెంచేసింది అని చెప్పాలి. ఈ నేపధ్యంలో అన్ని భాషలలో దసరా థీయాట్రికల్ రైట్స్ కోసం గట్టి పోటీ ఉంది.
ఒరిజినల్ భాషకి ఏ మాత్రం తీసిపోని విధంగా క్వాలిటీగా డబ్బింగ్ చేయడంతో పాటు పాటలని కూడా ఆయా భాషలలో టాప్ లెరిక్ రైటర్స్ తో రాయించి పాడించారు. దీంతో సాంగ్స్ అన్ని భాషలలో భాగా రీచ్ అయ్యింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ మూవీకి సంబందించిన తెలుగు థీయాట్రికల్ రైట్స్ బిజినెస్ ఇప్పటికే పూర్తయ్యింది. సుమారు వంద కోట్ల వరకు బిజినెస్ జరిగినట్లు తెలుస్తుంది. ఇప్పుడు కన్నడ నాట దసరా థీయాట్రికల్ రైట్స్ కోసం గట్టి పోటీ ఉందని టాక్ వినిపిస్తుంది.
కేజీఎఫ్ నిర్మాత విజయ్ కిరంగదూర్ ఈ మూవీ రైట్స్ ని సొంతం చేసుకునే ప్రయత్నంలో ఉన్నారని తెలుస్తుంది. తెలుగు సినిమాలకి కన్నడ ఇండస్ట్రీలో మంచి మార్కెట్ ఉంటుంది. అది కూడా ఇప్పుడు నేరుగా ఆ భాషలో రిలీజ్ అవుతున్న నేపధ్యంలో మంచి ఆదరణ ఉంటుందని భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో కన్నడ ఇండస్ట్రీలో బడా నిర్మాతలు ఈ మూవీ రిలీజ్ రైట్స్ కోసం పోటీ పడుతున్నారని తెలుస్తుంది.
ఇప్పటికే బెంగుళూరు వెళ్ళిన నాని అక్కడ సీనియర్ యాక్టర్ రవిచంద్రన్ తో పాటు మరికొంత మంది కన్నడ స్టార్స్ తో కలిసి మూవీ ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే దసరా మూవీకి హిందీలో కూడా మంచి బిజినెస్ జరిగిందని తెలుస్తుంది. అలాగే తమిళంలో అనిరుద్ ఒక సాంగ్ పాడాడు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ తమిళనాడుకి చెందిన వ్యక్తి, ఇక కీర్తి సురేష్ కి తమిళంలో మంచి ఫాలోయింగ్ ఉంది. దీంతో అక్కడ కూడా ప్రేక్షకులకి దసరా కనెక్ట్ అవుతుందని భావిస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.