సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి బ్యాక్ గ్రౌండ్ - గాడ్ ఫాదర్ ఉండడం చాలా ముఖ్యం అనే నమ్మకం ఉంది. చాలాసార్లు ఇది నిజమవుతుంది కూడా. కానీ ఎంత బడా బ్యాక్ గ్రౌండ్ ఉన్నా.. హీరోగా నిలదొక్కుకోవడంపై మాత్రం గ్యారంటీ ఉండదు. దీనికి ఉదాహరణగా దిగ్గజ దర్శకుడు దాసరి నారాయణ రావు కొడుకు దాసరి అరుణ్ ని చెప్పుకోవచ్చు.
ఇదిలా ఉండే రీసెంట్ గా హిట్ కొట్టిన ఓ హీరో.. తనను తాను ఇండస్ట్రీలో నిలబెట్టుకునేందుకు మంచి స్కెచ్ వేసినట్లుగా తెలుస్తోంది. సినిమా నిర్మాతలుగా పేరుండి, ప్రస్తుతం ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిని పిలిచి తనతో సినిమాలు తీయాల్సిందిగా చెబుతున్నాడట. నిర్మాణానికి అయ్యే ఖర్చంతా తనే భరించినా.. నిర్మాతగా మాత్రం అవతలి వ్యక్తి పేరు ఉంటుందంతే. అంటే ఓ షాడో ప్రొడ్యూసర్ గా, ఘోస్ట్ నిర్మాతగా వ్యవహరిస్తాడన్న మాట.
అసలు డబ్బులన్నీ తనవే అయినపుడు.. వేరే నిర్మాతల పేర్లు పెట్టడం ఎందుకు... తన సినిమాలు తానే తీసేకుకోవచ్చు కదా అనే డౌట్ రావడం సహజమే. కానీ అసలు కిటుకు ఇక్కడే ఉంది. ఇలా నిర్మాతలు తనతో సినిమా తీసేందుకు వెంటబడుతున్నారన్న ఇమేజ్ సాధించడం చాలా ముఖ్యం. ఇండస్ట్రీలో సుదీర్ఘ కాలం ఉండాలన్నా, ఆఫర్లు క్యూ కట్టాలన్నా వెనకాల ఉండే నిర్మాతల సంఖ్యే కీలకం. అందుకే ఈ కొత్త స్కెచ్ అంటున్నారు సినీ జనాలు.