సినిమా రంగంలో రాణించాలనుకునే ఔత్సాహికుల కోసం సీనియర్ నటుడు జగపతి బాబు ‘క్లిక్ సినీ కార్ట్’ అనే వెబ్ పోర్టల్ ఆరంభించడంపై దర్శకరత్న దాసరి నారాయణరావు ప్రశంసలు కురిపించారు. ఇలాంటి బాధ్యతతో కూడిన ప్రయత్నం జగపతి బాబు లాంటి సిన్సియారిటీ ఉన్న వ్యక్తి మాత్రమే చేయగలడని దాసరి అన్నారు. జగపతి కాకుండా వేరెవ్వరు ఇలాంటి పోర్టల్ ఆరంభించి ఉన్నా తాను మద్దతు పలికే వాడిని కాడని.. అతడి కమిట్మెంట్ తనకెంతో ఇష్టమని దాసరి అన్నారు.
‘‘జగపతిబాబు నాకు ఈ కాన్సెప్ట్ చెప్పినప్పుడు బాగా నచ్చింది. క్రియేటివ్ డైరెక్టర్లకు ఇది చాలా మంచి వేదిక. సినిమాలకు కొత్త వాళ్లు కావాలి. కొత్తవారితో సినిమా చేయాలనుకునే వారికి ఈ పోర్టల్ బాగా ఉపయోగపడుతుంది. నేను డైరెక్ట్ చేసిన స్వర్గం-నరకం సినిమా కోసం దాదాపు వెయ్యి మంది కొత్తవాళ్లను ఆడిషన్ చేశాను. చివరగా 200 మందిని ఎంచుకున్నాం. దీని కోసం వైజాగ్.. విజయవాడ.. కాకినాడ.. హైదరాబాద్.. తిరుపతి.. ఇలా రకరకాల ప్రాంతాలు తిరిగాం. ఇలాంటి శ్రమ లేకుండా కొత్తవాళ్లను ఎంచుకోవడానికి.. వాళ్లు అవకాశం పొందడానికి జగపతి మంచి ఆలోచన చేశాడు. సినిమాలు తీయాలని.. నటించాలని ఇండస్ట్రీకి వచ్చే వాళ్లు మోసపోతున్నారు. ఎవరికీ ఎలాంటి శ్రమ లేకుండా ‘క్లిక్ సినీ కార్ట్’ను జగపతి జనాల ముందుకు తెచ్చాడు.
జగపతిబాబు కాకుండా మరెవరైనా ఈ ఆలోచన చేస్తే కచ్చితంగా నేను ఇన్వాల్వ్ అయ్యేవాడిని కాదు. జగపతి బాబు కమిట్మెంట్.. క్రమశిక్షణ ఉన్న వ్యక్తి. ఇలాంటి వాళ్ల వల్లే ఇలాంటి పనులు సాధ్యమవుతాయి. ఎలాంటి ఫీజు లేకుండా.. ఒక సెల్ఫీ తీసుకొని రిజిస్టర్ చేసుకుంటే ఈ వెబ్ సైట్లో మెంబర్ కావచ్చు. జగపతి తన సొంత బేనర్లో కొత్తవాళ్లతో రెండు సినిమాలు చేస్తానంటున్నాడు. అందరూ కొత్తవాళ్లకే ఛాన్స్ ఇవ్వకపోయినా 50-60 శాతం వరకు అయినా కొత్తవాళ్లను తీసుకోవాలి’’ అని దాసరి అన్నారు.