కన్నడ రాకింగ్ స్టార్ యష్ తో `కేజీఎఫ్` సీరీస్ లని అందించి ఒక్కసారిగా టాక్ ఆఫ్ ద ఇండియాగా మారాడు ప్రశాంత్ నీల్. పాన్ ఇండియా వైడ్ గా భారీ క్రేజ్ ని సొంతం చేసుకున్న ఈ క్రేజీ డైరెక్టర్ ప్రస్తుతం ప్రభాస్ తో హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా `సలార్`ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.
హోంబలే ఫిలింస్ బ్యానర్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఏక కాలంలో తెలుగు, కన్నడ భాషల్లో రూపొందుతున్న ఈమూవీని పాన్ ఇండియా వైడ్ గా తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషలలో రిలీజ్ చేయనున్నారు.
ఫస్ట్ లుక్ తో భారీగా అంచనాలని సెట్ చేసిన ప్రశాంత్ నీల్ ఈ మూవీని `కేజీఎఫ్ ` తరహాలోనే రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. కానీ టీమ్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే టూ పార్ట్స్ కి సంబంధించిన రిలీజ్ కు డెడ్ లైన్ ని సెట్ చేసుకున్నారట. ఇదిలా వుంటే ప్రస్తుతం ప్రభాస్ మోకాలి సర్జరీ కారణంగా రెస్ట్ లో వుండటంతో అది సాధ్య మయ్యేలానా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం రెస్ట్ లో వున్న ప్రభాస్ ఈ నెలలోనే సెట్స్ లోకి ఎంటర్ కాబోతున్నారట.
అంతే కాకుండా నాన్ స్టాప్ గా షూటింగ్ లో పాల్గొనబోతున్నాడని చెబుతున్నారు. అంతే కాకుండా ఈ మూవీని సూపర్ ఫాస్ట్ గా పూర్తి చేయాలని బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ ని దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇందు కోసం ప్రభాస్ నాలుగు నెలల బల్క్ డేట్స్ ని కేటాయించాల్సిందేనని కోరినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా ఈ డేట్స్ ప్రకారం `సలార్` 2 పార్ట్స్ ని ఈ ఏడాది చివరికల్లా పూర్తి చేయాలనే ప్లాన్ లో వున్నట్టుగా తెలుస్తోంది.
రెండు భాగాలకు సంబంధించిన షూటింగ్ ని పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కోపసం అత్యధిక సమయాన్ని కేటాయించబోతున్నారట. ఇందు కోసం పక్కా ప్రణాళికని దర్శకుడు ప్రశాంత్ నీల్ సిద్ధం చేసుకున్నారని చెబుతున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ లో పార్ట్ 1ని, ఎండింగ్ లో అంటే డిసెంబర్ లో పార్ట్ 2 ని భారీ స్థాయిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ డెడ్ లైన్ ప్రకారం రెండు భాగాలని పూర్తి చేయడం కష్టమే అయినా ప్రశాంత్ నీల్ చేసి చూపించాలని గట్టి నిర్ణయంతో వున్నారట.
శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలోని కీలక పాత్రల్లో రాజమనార్ గా జగపతిబాబు, ఇతర పాత్రల్లో మధు గురుస్వామి, ఈశ్వరీ రావు నటిస్తున్నారు. ఈ సినిమాకు సంగీతం రవి బాస్రూర్ , సినిమాటోగ్రఫీ భువన్ గౌడ, యాక్షన్ అన్బుఅరివు, ప్రొడక్షన్ డిజైనర్ శివకుమార్.