ముద్దుగుమ్మలు ముద్దులాడుకున్నవేళ!

Update: 2015-03-17 05:23 GMT
మూతి మూతి రాసుకుంటే ముద్దు పుట్టున్‌! అన్న చందంగా ఉంది ఈ ముద్దుగుమ్మల వ్యవహారం. ఉన్నట్టుండి రెండు పెదవుల్ని నునుపైన బుగ్గలపై ఆన్చి ప్రేమను వ్యక్తం చేయడం అనేది ఇద్దరిమధ్య సాన్నిహిత్యానికి సింబాలిక్‌. ఫేజ్‌2 జనాల్లో ఇదో ఫ్యాషన్‌. అయితే ఇటీవలే 'ఎన్‌హెచ్‌ 10' ప్రీమియర్‌ షో సందర్భంలో చిత్రకథానాయిక అనుష్కశర్మను సుతారంగా తాకి, ఆ నునుపైన బుగ్గలపై ముద్దొకటి ఇచ్చి చూపరుల అటెన్షన్‌ని తనవైపే ఉండేలా చేసుకుంది పొడుగుకాళ్ల సుందరి దీపికపదుకొన్‌.

ఈ ఇద్దరికీ మధ్య ఎలుకా పిల్లి, పాము-కప్పకి ఉన్నంత వైరం ఉంది. అయినా ఇలా ముద్దులాడుకోవడం, కౌగిలింతల్లోకి దిగిపోవడం, ముసిముసిగా నవ్వేసుకోవడం చూసిన జనాలకు వింతగా అనిపించింది. ఇద్దరిమధ్యా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతటి వైరం ఉండేది. అయితే అదంతా ఇట్టే మర్చిపోయి అట్టే కలిసిపోయారు. అప్పట్లో దీపిక డిప్రెషన్‌లో ఉంది.. అనగానే దానికి కారణం పక్కాగా ఉంది... అంటూ అనుష్క వంత పాడింది. ఇప్పుడు ఎన్‌హెచ్‌ 10 చూసి అనుష్క గొప్పగా నటించింది ఈ చిత్రంలో అంటూ పొగిడేసింది. కాఫీ విత్‌ కరణ్‌ షోలోనూ అనుష్క, నేను గొప్ప స్నేహితురాళ్లం అంటూ ముసిముసిగా నవ్వేసి జనాల్లో టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌ అయ్యింది. ఏదేమైనా ఈ అమ్మళ్ల వాలకం చూస్తుంటే తేడాగానే ఉంది.

Tags:    

Similar News