దీప్-వీర్ తో అలా ఆవిడ హర్టయిందట!

Update: 2018-08-03 17:39 GMT
మనం హుస్సేన్ సాగర్ కంపును భరిస్తూ పక్కనే ఉన్న నెక్లెస్ రోడ్ వాక్ వే లో అలా నడిచినా - లేదంటే అమెరికా లోని అత్యంత ఖరీదైన ప్రాంతమైన న్యూ యార్క్ బే ఏరియాలో  అల్ట్రా-స్టైలిష్ గెటప్పులో అలా నడిచినా పట్టించుకునేవాడు ఒక్కడు కూడా ఉండడు.  అదే కనుక ఓ  ఫిలిం స్టార్ అలా నడిస్తే పరిస్థితి ఏంటి? ఎక్కడైనా ఒకే తంతు.. అందరి దగ్గరా స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి.. ఆ ఫోన్ లలో 10 మెగా పిక్సెల్ పైబడిన కెమెరాలు ఉన్నాయి. దీంతో ఫోటోలు తీస్తారు.. వీడియోలు తీస్తారు..  అన్నిటినీ సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తారు.

పాపం.. అదే పరిస్థితి బాలీవుడ్ లవర్ కపుల్ అయిన దీపిక పదుకొనే - రణ్ వీర్ సింగ్ జంట కు ఎదురయింది.  దీప్-వీర్ గా సోషల్ మీడియాలో పాపులర్ అయినా ఈ జంటకు భారీ ఫాలోయింగే ఉంది. తమ లవ్వును ఎప్పుడూ ఓపెన్ గా అంగీకరించకపోయినా.. తిరస్కరించనూ లేదు.  కలిసి తిరుగుతారు.. ఎక్కడైనా వెకేషన్ కోసం జంటగా కలిసి అలా చెక్కేస్తారు. మీడియాను తప్పించుకునే అవకశం ఉంది కానీ ప్రపంచంలో ఉండే ఏ ఒక్క పనికి మాలిన దేశాన్ని కూడా వదలకుండా సెటిల్ అయిన మన ఇండియన్స్ దృష్టి నుండి ఎలా తప్పించుకుంటారు? పైగా అమెరికా అంటే.. అందరూ ట్రంప్.. హెచ్ వన్ బీ లు అని అంటుంటారు గానీ సరిగ్గా చెప్తే అది మనోళ్ళకు రెండో ఇండియా.   ఇక ఈ దీప్-వీర్ లు ఆ అమెరికాలో ని ఫ్లోరిడాలో జంటగా తిరుగుతూ ఉంటే జైనాబ్ ఖాన్ అనే ఓ దీప్-వీర్ డై హార్డ్ ఫ్యాన్ కంటబడ్డారు. ఇంకేముంది.. ఆమె వీడియో తీయడం మొదలు పెట్టింది. ఆ దీప్-వీర్  లకు చిర్రెత్తడంతో మొహాన్ని అదోలా పెట్టుకొని ఈ ఫ్యాన్ తో రూడ్ గా ప్రవర్తించారట.

ఈ విషయం ఆ ఫ్యాన్ సోషల్ మీడియా ద్వారా పంచుకొని వాళ్ళ సంగతిని బట్టబయలు చేసింది. ఏది తప్పు ఏది ఒప్పు అనే అసందర్భపు చర్చ లేకుండా దీప్- వీర్ లు ఫ్లోరిడా నుండి ముంబై లో ల్యాండ్ అయ్యే లోపు ఈ టాపిక్ సోషల్ మీడియా లో హాట్ టాపిక్ అయింది.  ఎలాగూ సెలబ్రిటీసే కదా. తప్పదు. 
Tags:    

Similar News