బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరిగా నటిస్తోంది దీపికా పదుకునే. గ్లామర్ రోల్స్ తో పాటుగా కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రాలలో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. స్టార్ హీరోల ఫస్ట్ ఛాయిస్ గా మారిపోయిన ఈ బ్యూటీ.. హాలీవుడ్ లోనూ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం పలు ఆసక్తికరమైన ప్రాజెక్ట్స్ లో నటిస్తున్న దీపికా.. గతంలో డిప్రెషన్ సమస్యతో సూసైడ్ చేసుకోవాలనిపించేదని తెలిపింది.
ఇప్పటికే పలు సందర్భాల్లో డిప్రెషన్ తో ఫైట్ చేయడం గురించి మాట్లాడిన దీపికా పదుకొణె.. ఇటీవల ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో కొన్ని సంవత్సరాల క్రితం తన మెంటల్ హెల్త్ ఎలా ఉండేదనే గురించి చెప్పింది. మానసిక అనారోగ్యం అనేది ఒకరి వృత్తిపరమైన విజయానికి నేరుగా సంబంధం లేదని ఆమె పేర్కొంది.
'స్పష్టమైన కారణం లేకుండానే ఏడ్చేదాన్ని. ఒత్తిడి నుంచి తప్పించుకోవడానికి ఎప్పుడూ నిద్రపోవాలని.. ఆత్మహత్య చేసుకోవాలనిపించేది' అని దీపికా పదుకునే తెలిపింది. డిప్రెషన్ సమయంలో తన తల్లి ఉజ్జల పదుకొణె తోడుగా నిలిచిందని.. ఆ సంకేతాలు మరియు లక్షణాలను ముందే గుర్తించిన తన అమ్మకు క్రెడిట్ ఇవ్వాలని చెప్పుకొచ్చింది.
డిప్రెషన్ పై విజయం సాధించిన దీపిక.. మానసిక ఒత్తిడి సమస్యలతో బాధపడేవారికి సహాయం చేయడానికి 2015 లో లాభాపేక్షలేని 'ది లైవ్ లవ్ లాఫ్ ఫౌండేషన్' అనే ఎన్జీవోను ప్రారంభించింది. ఈ సంస్థ ద్వారా డిప్రెషన్ కు గురైన వ్యక్తులకు జీవితం గురించి అవగాహన కల్పిస్తుంటారు.
ఇక సినీ కెరీర్ విషయానికొస్తే.. 'ఐశ్వర్య' అనే కన్నడ సినిమాతో తెరంగేట్రం చేసిన అందాల భామ దీపికా పదుకునే.. రెండో చిత్రం ‘ఓం శాంతి ఓం’ తో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. సల్మాన్ ఖాన్ మినహా బాలీవుడ్ స్టార్ హీరోలందరితో నటించింది. 2018లో బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ ను ప్రేమ వివాహం చేసుకున్న ఈ బ్యూటీ.. పెళ్లి తర్వాత కూడా సక్సెస్ ఫుల్ కెరీర్ కొనసాగిస్తోంది.
దీపికా పదుకొణే చివరిగా అమెజాన్ ప్రైమ్ వీడియో ఒరిజినల్ ఫిల్మ్ 'గెహ్రైయాన్' లో కనిపించింది. ఇందులో ఆమె సిద్ధాంత్ చతుర్వేది - అనన్య పాండే లతో స్క్రీన్ షేర్ చేసుకుంది. ప్రస్తుతం షారూక్ ఖాన్ సరసన 'పఠాన్' సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇది 2023 జనవరి 25న థియేటర్లలోకి రానుంది.
ఇదే క్రమంలో 'ప్రాజెక్ట్ K' చిత్రంతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు జోడీగా నటిస్తోంది దీపికా. ఇది ఈమెకు టాలీవుడ్ డెబ్యూ. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పాన్ వరల్డ్ మూవీ 2023 చివర్లో లేదా 2024 ప్రారంభంలో విడుదల కానుంది. అలానే 'సర్కస్' 'బ్రహ్మాస్త్ర' 'జవాన్' వంటి చిత్రాల్లో గెస్ట్ రోల్స్ లో కనిపించనుంది దీపికా.