సినిమాలో పాటలోస్తే సిగరెట్ కోసం కాకుండా మనకే తెలియకుండా వేసే స్టెప్పులకోసం ప్రేక్షకుడు ఎదురు చూసే భావనని కలిగించిన సంగీత దర్శకులలో దేవిశ్రీ ప్రసాద్ ఒకరు. ఫుట్ టాపింగ్ మ్యూజిక్ కి దేవి ప్రసిద్ధి. పాట వింటుంటే మనకు తెలియకుండానే మన బాడీలో పార్ట్లు చిన్నపాటి డ్యాన్స్ చేయించగలగడం దేవికి మాత్రమే దక్కిన క్రెడిట్.
గత కొన్ని నెలలుగా థియేటర్ లో సాంగ్స్ కి సరైన రెస్పాన్స్ లేదన్న మాట వాస్తవమే. అయితే నేను శైలజ సినిమాలో ఓ రెండు పాటలు మాత్రం మాస్ నుంచి మల్టీప్లెక్స్ ప్రేక్షకుల వరకూ అందరినీ అలరిస్తున్నాయి. రామజోగయ్య శాస్త్రి రాసిన క్రేజీ క్రేజీ ఫీలింగ్ పాట యువతలో దాగున్న ప్రియుడిని గుర్తుచేస్తుంటే, భాస్కరభట్ల రచించిన శైలజా శైలజ పాట లవ్ ఫెయిల్యూర్ లకు జోష్ తెప్పిస్తుంది.
ఈ రెండు పాటలకు సింగింగ్, దేవి బీట్ సౌండింగ్ - డైరెక్టర్ టేకింగ్ లు కూడా చక్కగా కుదరడంతో థియేటర్ లో రెస్పాన్స్ అదుర్స్. బయటకివచ్చాక కూడా ప్రేక్షకుడు రిపీట్ మోడ్ లో అటు బ్రెయిన్ లోనూ ఇటు ఫోన్ లోనూ ఈ పాటలను ప్లే చేసుకోవడం గమనార్హం.