అక్కినేని హీరోలు అనుకునే చేశారా..? యాదృచ్ఛికమా..?

Update: 2022-10-19 06:49 GMT
అనుకునే చేశారా..? లేక యాదృచ్ఛికంగా జరిగిందా..? అనేది తెలియదు కానీ అక్కినేని హీరోలు ముగ్గురూ తమ నెక్స్ట్ ప్రాజెక్టులను తమిళ దర్శకుల చేతిలో పెట్టారు. ముందుగా అక్కినేని మన్మధుడు నాగార్జున విషయానికి వస్తే ఈయ‌న‌ ఇటీవల 'ది ఘోస్ట్' మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ యాక్షన్ మూవీ బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది.

అయితే నాగార్జున తన తదుపరి చిత్రాన్ని ప్రముఖ తమిళ దర్శకుడు మోహన్ రాజా తో చేయబోతున్నాడు. ఈ విషయంపై ఇప్పటికే క్లారిటీ వచ్చింది. నాగార్జున కెరీర్ లో 100వ ప్రాజెక్ట్ ఇది. మెగాస్టార్ చిరంజీవితో 'గాడ్ ఫాదర్' ను తెర‌కెక్కించి హిట్ అందుకున్న మోహన్ రాజా నాగార్జున వందో సినిమా కోసం వర్క్ చేయబోతున్నాడు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌ స్క్రిప్ట్ పనులు ప్రారంభం కానున్నాయి.

అలాగే యువర్ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య 'థాంక్యూ' ఫ్లాప్ తర్వాత తమిళ దర్శకుడు వెంకట్‌ ప్రభు తో తన తదుపరి చిత్రాన్ని ప్రారంభించాడు. ఇందులో యంగ్ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంటే.. చైతు పోలీస్ ఆఫీసర్ గా అల‌రించ‌బోతున్నాడు.‌ శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ ద్విభాష చిత్రంలో అరవింద్‌ స్వామి, ప్రియమణి, ప్రేమి విశ్వనాథ్, సంపత్ రాజ్ తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటోంది.

ఇక చివరిగా అఖిల్ విషయానికి వస్తే.. ఈయన సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'ఏజెంట్' అనే మూవీని కంప్లీట్ చేశాడు. ఈ చిత్రం విడుదల కోసం సిద్ధమవుతోంది. అయితే 'ఏజెంట్‌' అనంతరం అఖిల్ సైతం ఓ తమిళ దర్శకుడితో కొత్త ప్రాజెక్ట్ ను పట్టా లెక్కించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని వార్తలు వస్తున్నాయి.

ఇంతకీ ఆ దర్శకుడు మరెవరో కాదు పి.ఎస్‌.మిత్రన్‌. ఈయన తాజాగా కార్తీతో తీసిన 'సర్దార్' సినిమా దీపావళి కానుక విడుదల కాబోతోంది. అయితే మిత్రన్‌ తన తదుపరి చిత్రాన్ని అఖిల్‌తో చేసేందుకు సిద్ధం అయ్యాడట. ఇప్పటికే ఈయన క‌థ‌ వినిపించడం.. అది అఖిల్ కు బాగా నచ్చడం జరిగిపోయిందని అంటున్నారు.

త్వరలోనే ఈ ప్రాజెక్టు పై అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వస్తుందని బలంగా టాక్ వినిపిస్తోంది. మొత్తానికి అక్కినేని హీరోలు ముగ్గురూ త‌మ త‌మ నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం తమిళ‌ దర్శకులను నమ్ముకున్నారు. మ‌రి ఆ త‌మిళ ద‌ర్శ‌కులు అక్కినేని హీరోల‌కు స‌క్సెస్ ను అందిస్తారా..? లేదా..? అన్న‌ది చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News