'సాహో' అంత హైప్ లేక‌పోవ‌డానికి కార‌ణం?

Update: 2020-07-30 05:45 GMT
బాహుబ‌లి ఫ్రాంఛైజీ చిత్రాల‌తో ప్ర‌భాస్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన‌ బాహుబ‌లి 1.. బాహుబ‌లి 2 క‌లుపుకుని బాక్సాఫీస్ వ‌ద్ద దాదాపు రూ.2200 కోట్లు వ‌సూలు చేయ‌డం ఒక సంచ‌ల‌నం. ఒక సౌతిండియా సినిమా అందునా తెలుగు సినిమా `దంగ‌ల్` లాంటి మాస్ట‌ర్ పీస్ తో పోటీప‌డి ఆ సినిమాని కూడా ఇండియా వ‌సూళ్ల‌లో వెన‌క్కి నెట్టి సంచ‌ల‌నం సృష్టించ‌డంపై అప్ప‌ట్లో అంతా ఆసక్తిగా మాట్లాడుకున్నారు. బాలీవుడ్ మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ట్ అమీర్ ఖాన్ న‌టించిన దంగ‌ల్ దేశీయ వ‌సూళ్ల ప‌రంగా బాహుబ‌లి2 కంటే వెన‌క‌బ‌డ‌డం సంచ‌ల‌న‌మైంది. ఇదీ మ‌న ప్ర‌భాస్ స్టామినా అంటూ తెలుగు యువ‌త గొప్ప‌గా చెప్పుకుంది.

ఆ కిక్కుతో ప్ర‌భాస్ వెంట‌నే `సాహో` లాంటి మ‌రో భారీ పాన్ ఇండియా చిత్రంలో న‌టించాడు. బాహుబ‌లి 2ని మించిన బ‌డ్జెట్ తో సాహ‌స‌మే చేశారు. హాలీవుడ్ సాంకేతిక నిపుణుల‌తో భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ని తెర‌కెక్కించి రిలీజ్ చేయ‌గా.. సాహో హిందీ బెల్టులో బాక్సాఫీస్ ని ఓ ఊపు ఊపింది. అయితే టాలీవుడ్ లో.. ఇత‌ర సౌత్ భాష‌ల్లో మాత్రం ఆశించినంత పెద్ద విజ‌యం సాధించ‌లేక‌పోయింది. ఒక ర‌కంగా ఈ ఫ‌లితం ప్ర‌భాస్ కి నిరాశ‌నే మిగిల్చింది. ఇక బాహుబ‌లి ప్ర‌భావంతో సాహోకి అద్భుత‌మైన ప్రీరిలీజ్ బిజినెస్ చేయ‌గ‌లిగారు. కానీ ఇప్పుడా సీన్ ఉందా? అంటే సందేహ‌మే.

తాజాగా ప్ర‌భాస్ న‌టిస్తున్న 20వ చిత్రం `రాధే శ్యామ్`కి కూడా అదే స‌న్నివేశం ఉందా? అంటే అందుకు చాన్సే లేద‌ని చెబుతున్నారు. రాధేశ్యామ్ కి ప్రీబిజినెస్ ప‌రంగా అంత హైప్ లేనేలేదు. సాహో తో పోలిస్తే ఈ సినిమాని పెద్ద‌ రేంజు అని మార్కెట్ వ‌ర్గాలు భావించ‌డం లేద‌న్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. మ‌హ‌మ్మారీ కూడా ఈ మూవీకి హైప్ రాకుండా దెబ్బ కొట్టింది. ఈ లాక్ డౌన్ పీరియ‌డ్ లో రాధే శ్యామ్ కి హైప్ బిల్డ్ చేయ‌డంలో టీమ్ విఫ‌ల‌మైంద‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. అలాగే సాహో సినిమాతో ఏమాత్రం పోలిక లేని క‌థ‌తో రాధే శ్యామ్ తెర‌కెక్కుతోంది. ఇది సున్నిత‌మైన ప్రేమ‌క‌థ నేప‌థ్యంలో శృంగార ర‌సాత్మ‌క విలువ‌ల‌తో తెర‌కెక్కుతున్న‌ది కాబ‌ట్టి మాస్ లో ఆశించినంత హైప్ రాలేదని విశ్లేషిస్తున్నారు. అయితే అన్ని అంచ‌నాల్ని త‌ల‌కిందులు చేసేంత అసాధార‌ణ‌ కంటెంట్ సినిమాలో ఉంటే అంచ‌నాల‌తో ప‌ని లేకుండా విజ‌యం సాధించే అవ‌కాశం ఉంటుంది. మ‌రి ఆ ఫీట్ రాధాకృష్ణ వేయిస్తాడా? అన్న‌ది చూడాలి.
Tags:    

Similar News