సౌత్ దర్శకుల్లో చాలా ప్రత్యేకమైన గుర్తింపు పేరు ఉన్న బాలాకు జరగకూడని అవమానం అర్జున్ రెడ్డి రిమేక్ వర్మ విషయంలో జరిగిన సంగతి తెలిసిందే. ఫైనల్ వెర్షన్ చూశాక చెత్తగా ఉందంటూ దాన్ని పక్కన పెట్టేసి సందీప్ అసిస్టెంట్ గిరిసాయతో కొత్త వెర్షన్ మొదలుపెట్టారు. దాని షూటింగ్ కూడా చాలా వేగంగా కేవలం మూడు నెలల్లో పూర్తయిపోయింది. ఇంత ఫాస్ట్ గా ఎలా తీశారా అని అందరూ ఆశ్చర్యపోయారు కూడా.
ఇదే అనుమానం బాలాకు వచ్చినట్టు ఉంది. తను తీసిన భాగంలోని సీన్స్ ఏమైనా వాడుకున్నరేమో అని విక్రం తో పాటు సదరు సంస్థలు లీగల్ నోటీసులు పంపినట్టు చెన్నై మీడియా టాక్. మీరు వద్దనుకుని పక్కన పెట్టిన తాను తీసిన ఫస్ట్ వెర్షన్ లో ఏ సీన్ వాడుకున్నా చట్టరిత్యా చర్యలు ఉంటాయని అందులో పేర్కొన్నట్టు తెలిసింది. అయితే దీనికి ఛాన్స్ చాలా తక్కువగా ఉంది. కారణం హీరొయిన్ తో సహా దాదాపు స్టార్ క్యాస్టింగ్ మొత్తం మార్చి ఫ్రెష్ గా రీమేక్ చేశారు.
అందులోనూ ధృవ్ లుక్ లో కూడా మార్పులు జరిగాయి. అలాంటప్పుడు బాలా తీసిన దాంట్లో నుంచి వాడుకునే అవకాశాలు తక్కువ. అయినా ఏదీ కొట్టిపారేయలేని పరిస్థితి కాబట్టి బాలా ముందు జాగ్రత్తగా ఈ చర్యకు పూనుకున్నాడట. ఈ వివాదం జరిగినప్పుడు సైలెంట్ గా ఉన్న బాలా ఇప్పుడు వెలుగులోకి రావడం విశేషం. వచ్చే నెలలో విడుదల కాబోతున్న ఆదిత్య వర్మ మీద విక్రం ఫాన్స్ లో మాములు అంచనాలు లేవు