ఇండియా లో గత మూడు సంవత్సరాల్లో ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ యొక్క ఆధరణ ఎంతగా పెరిగిందో అందరం చూస్తూనే ఉన్నాం. నెట్ ఫ్లిక్స్ కు ఒకప్పుడు అమెరికాతో పాటు కొన్ని పాశ్చాత్య దేశాల్లో మాత్రమే ఖాతాదారులు ఉండేవారు. కానీ ఈ మధ్య కాలంలో ఇండియాలో నెట్ ఫ్లిక్స్ యొక్క ఖాతాదారుల సంఖ్య విపరీతంగా పెరిగిన విషయం తెల్సిందే.
ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన సినిమాల్లో ఈమధ్య కాలంలో మెజార్టీ సినిమాలను నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసి స్ట్రీమింగ్ చేస్తున్న విషయం తెల్సిందే. అమెజాన్ ఆ మధ్య పోటీ పడ్డా కూడా ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ వారు ఏకచత్రాధిపత్యం ను ప్రదర్శిస్తున్నట్లుగా ఓటీటీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
కేవలం హిందీ సినిమాలు మాత్రమే కాకుండా సౌత్ భాషలకు చెందిన అన్ని సినిమాలను కూడా నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేస్తోంది. సౌత్ సినిమాలను ముఖ్యంగా తెలుగు సినిమాలను నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసిన సమయంలో కొన్ని సమస్యలు వస్తున్నాయట.
ముఖ్యంగా తెలుగు భాషకు చెందిన నెట్ ఫ్లిక్స్ కీలక వ్యక్తి లేకపోవడంతో తెలుగు నిర్మాతలు ఇబ్బందులు పడుతున్నారు.
నెట్ ఫ్లిక్స్ ఇండియా ప్రతినిధులతో చర్చలు జరిపే సమయంలో లాంగ్వేజ్ సమస్యలు తలెత్తి బిజినెస్ విషయాల్లో ఇబ్బంది ఎదురు అవుతుందని.. అందుకే తెలుగు భాషకు ప్రత్యేకంగా ఒక అధినేత ఉంటే బాగుంటుంది అంటూ దర్శకుడు హరీష్ శంకర్ కీలక సూచనను నెట్ ఫ్లిక్స్ వారికి చేయడం జరిగింది.
దర్శకుడి యొక్క ప్రతిపాధనను చాలా మంది తెలుగు ఫిల్మ్ మేకర్స్ అభినందిస్తున్నారు. మరి నెట్ ఫ్లిక్స్ ఎలా స్పందిస్తుంది అనేది చూడాలి. ఈ మధ్య కాలంలో తెలుగు లో పెద్ద చిన్నా అనే తేడా లేకుండా చాలా సినిమాలను కూడా నెట్ ఫ్లిక్స్ వారు కొనుగోలు చేస్తూ దూసుకు పోతున్నారు. అందుకే తెలుగు భాష యొక్క కంటెంట్ విషయంలో తుది నిర్ణయం తీసుకునే విధంగా ఒక తెలుగు వ్యక్తి ఉంటే బాగుంటుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.