ఆ డైలాగ్ పవన్ ను తిట్టినట్టు కాదు!

Update: 2018-12-03 14:30 GMT
సీనియర్ హీరో శ్రీకాంత్ తాజా చిత్రం 'ఆపరేషన్ 2019' డిసెంబర్ 1 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  పదకొండేళ్ళ క్రితం రిలీజ్ అయిన శ్రీకాంత్ సూపర్ హిట్ సినిమా 'ఆపరేషన్ దుర్యోధన' కు సీక్వెల్ గా ఈ మూవీ తెరకెక్కింది.  దర్శకుడు బాబ్జీ ఈ సినిమాను పొలిటికల్ డ్రామాగా రూపొందించాడు. రీసెంట్ గా 'ఆపరేషన్ 2019' టీమ్ ఒక మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సినిమా గురించి.. సినిమాకు వస్తున్న స్పందన గురించి దర్శకుడు.. హీరో మాట్లాడారు.

ఈమధ్య రిలీజ్ అయిన తన సినిమాల్లో అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన చిత్రం 'ఆపరేషన్ 2019' అని శ్రీకాంత్ అన్నాడు. ఈ ఎలెక్షన్ సీజన్ లో వోట్స్ .. ఎలెక్షన్ ప్రాధాన్యత తెలుపుతూ మంచి సినిమా తీశారంటూ కొంతమంది ప్రశంసిస్తున్నారని శ్రీకాంత్ తెలిపాడు. కానీ  కొందరు రివ్యూలు హార్ష్ గా రాయడం తమకు బాధ కలిగించిందని అన్నాడు.  

డైరెక్టర్ బాబ్జీ తమ సినిమాకు ప్రేక్షకులనుండి మంచి రెస్పాన్స్ వస్తోందని అంటున్నాడు.  కొంతమంది ఈ సినిమాను స్టార్ హీరోతో చేస్తే బాగుండేదని సలహా ఇస్తున్నారని.. పవన్ కళ్యాణ్ తో ఈ సినిమా తీస్తే బాగుండేదని అంటున్నారు.. కథ డిమాండ్ ను బట్టి హీరోను అనుకుంటామని అన్నాడు. ఈ సినిమాకు స్టార్ హీరోలు అవసరం లేదని అభిప్రాయపడ్డాడు.  ఒకవేళ పవన్ తో సినిమా చేద్దామని అనుకుంటే అయన నాకేమైనా డేట్స్ ఇస్తారా అని ప్రశ్నించాడు.  ఈ దేశ భవిష్యత్తు ఓటర్ చేతుల్లో ఉంటుందని.. యువత చేతుల్లో కాదనే పాయింట్ తో ఈ సినిమాను తెరకెక్కించామని వెల్లడించాడు.

ఈ సినిమాలో 'మాసిన గడ్డంతో వెళ్తే ఓట్లు పడవు' అనే డైలాగ్ ఉంది.  అది పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించింది అని కొందరు అనుకుంటున్నారు. అలాంటిదేమీ లేదని.. సినిమాలో వచ్చిన  సందర్భాన్ని బట్టే ఆ డైలాగ్ ఉందని అన్నాడు.  ఈమధ్య కాలంలో బోల్డ్ సినిమాలు.. లిప్పులాకులపై స్పందిస్తూ.. అన్ని సినిమాలను ముద్దులతోనే తీయాలా అని ప్రశ్నించాడు.  

 
Tags:    

Similar News