వైఎస్ ఆర్ బయోపిక్ అఫీషియల్ అయ్యాక దీని గురించిన చర్చలు ఊపందుకున్నాయి. ఇందులో ఏ ఏ పాత్రలు ఉంటాయి వాటికి ఎవరైతే బాగుంటారు అనే దాని గురించి రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. లీడ్ రోల్ వైఎస్ ఆర్ గా నటించేది మమ్ముట్టినే కాబట్టి ఇక మిగిలినవారి గురించి టాక్ జరుగుతోంది. ముఖ్యంగా వైఎస్ విజయమ్మగా ఎవరు చేస్తారు అనే దాని గురించి అప్పుడే ప్రచారం కూడా మొదలైపోయింది. సీనియర్ నటి శరణ్యను మహి రాఘవ సంప్రదించినట్టు సమాచారం. అదే నిజమైతే తను రైట్ ఛాయస్ అని చెప్పొచ్చు. నాయకుడు సినిమాలో కమల్ హాసన్ జోడిగా నటించడం మొదలుకుని ఇప్పటి హీరోలకు తల్లిగా తమిళ సినిమాలతో పాటు తెలుగులో కూడా కనిపిస్తున్న శరణ్య పేరుని మహి రాఘవ ఖరారు చేయాల్సి ఉంది. ఈశ్వరి రావు పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు టాక్. ఇక జగన్ మోహన్ రెడ్డి పాత్రలో ఏ హీరోను తీసుకుంటారు అనే దాని గురించి కూడా చర్చ ఊపందుకుంది. సూర్య అని పలు మాధ్యమాల్లో ప్రసారం కావడం చూసిన మహి రాఘవ వాటిని ఖండించాడు. భారతి పాత్ర కోసం నయనతారను కలిసారన్న వార్తను కూడా కొట్టి పారేసాడు.
ఇక వైఎస్ రాజకీయ ప్రస్థానంలో ప్రత్యర్థి చంద్రబాబు నాయుడు పాత్ర ఇందులో ఉంటుందా అనే అనుమానాలు కూడా రేకెత్తుతున్నాయి. సుదీర్ఘ టిడిపి పాలనకు చెక్ పెట్టి ప్రజాకర్షక పధకాలు - సంస్కరణల ద్వారా రెండు పర్యాయాలు అధికారాన్ని బాబుకి దూరం చేసింది వైఎస్ అరే. జననేత పాదయాత్ర చేపట్టినప్పుడు సిఎంగా ఉన్నది బాబునే. సో ఆయన లేకుండా కథను చూపించడం కొంచెం కష్టమే. ఇక జగన్ సోదరి షర్మిలా - వైఎస్ ఆర్ వెన్నంటే ఉన్న సూరీడు - తమ్ముడు వివేకానంద రెడ్డి - అల్లుడు అనిల్ ఇలా భారీ తారాగణమే అవసరం ఉంటుంది.ఇక కాంగ్రెస్ అధిష్టానాన్ని కూడా కథలో రాసుకుని ఉంటే సోనియా గాంధీ పాత్ర కూడా ఉండాల్సిందే. ఈ రకంగా దర్శకుడు మహి రాఘవ పెద్ద ఛాలెంజ్ ఎదుర్కోబోతున్నాడు.
యాత్ర అనే టైటిల్ కన్ఫర్మ్ చేయనప్పటికీ దాదాపు ఇదే ఖరారు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికీ ఆరోగ్యశ్రీ - 108 - ఫీజు రీఇంబర్స్ మెంట్ పధకాల ద్వారా జనం హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న రాజశేఖర్ రెడ్డి గారి బయోపిక్ అంటే సామాన్య ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి కలగడం ఖాయం. రాజకీయ వర్గాల్లో ఈ సినిమా ఎలా ఉండబోతోంది అనే గురించి ఇప్పటికే చర్చలు మొదలయ్యాయి. దర్శకుడు మహి రాఘవ మీద పెద్ద బాధ్యతే ఉంది.