''శ్రీరస్తు శుభమస్తు'' సినిమాకు హిట్టు టాక్ రావడమే కాదు.. కలక్షన్లపరంగా కూడా సీన్ బాగానే ఉంది. పైగా అల్లు శిరీష్ కూడా యాక్టింగ్ పరంగా ఇంప్రూవ్ అయ్యాడు. ఆ క్రెడిట్ అంతా దర్శకుడు పరశురామ్ ఖాతాలోనే వేస్తున్నారు గీతా ఆర్ట్స్ వారు కూడా. బన్నీ అండ్ అల్లు అరవింద్ మనోడ్ని తెగ పొగిడేస్తున్నారు. వీటిపై స్పందిస్తూ.. పరశురామ్ ఏమంటున్నాడంటే.. సారొచ్చారు సినిమా ఫ్లాపయ్యాక పిలిచి మరీ ఛాన్సు ఇచ్చారంటే వారెంత గొప్పవారో అర్దం చేసుకోండి అన్నాడు. ఈ సమయంలో మరొకొన్ని ఆసక్తికరమైన కామెంట్లు కూడా చేశాడు.
''ఏదో ఒక సినిమా హిట్టయ్యాకో.. కాస్త డబ్బులొచ్చాకో.. ఒక దర్శకుడికి రెండో ఆఫర్ ఇస్తారు ఒక ప్రొడ్యూసర్. కాని అల్లు అరవింద్ గారు మాత్రం.. శ్రీరస్తు శుభమస్తు సినిమా విడుదలవ్వక మునుపే.. ఓ 40 రోజుల మందే నాకు చెప్పారు.. 'నానా ఎక్కడికన్నా వెళ్తున్నావేమో తదుపరి సినిమా కోసం. వెళ్లొద్దు. మనం బ్యానర్ లోనే ఇంకోటి చేద్దం' అని అరివింద్ గారు చెప్పడం.. చాలా పెద్ద వరం'' అంటున్నాడు దర్శకుడు పరశురాం. ఈ సందర్భంగా ఇంకేమన్నాడంటే.. ''సార్.. మీరు నన్ను మెడపట్టి బయటకు గెంటేసే వరకు నేను గీతా ఆర్ట్స్ ఆఫీస్ లోనే తిరుగుతూ ఉంటాను. ఎక్కడికీ వెళ్ళను'' అని చెప్పాడు.
అయితే గీతా ఆర్ట్స్ సంస్థ అంటేనే.. అరవింద్ నుండి బన్నీ వరకు.. బన్నీ వాసు నుండి కొందరు పి.ఆర్.ఓ.లు వరకు తెగ ఇన్వాల్వ్ అయిపోయి దర్శకుడిని తన పనని సరిగ్గా చేయనివ్వరనే టాక్ ఉంది కదా.. దాని గురించి ఏమంటాడో పరశురామ్? ''ఏవండి ఒక తండ్రి కొడుక్కు జాగ్రత్తలు చెబుతున్నాడంటే.. ఖచ్చితంగా కొడుకు బాగు పడాలనే కదా. అరవింద్ గారు ఇచ్చే సజెషన్లు కూడా అంతే'' అనేశాడు ఈ డైరక్టర్.