అద్భుతం అంటే ఇదీ- సుకుమార్

Update: 2018-12-09 07:43 GMT
తొలి నుంచి ప్ర‌యోగాల‌తో వేడెక్కిస్తున్న హీరో.. అదే తీరుగా ఆలోచించే యువ‌ద‌ర్శ‌కుడు క‌లిసి చేస్తున్న మ‌రో భారీ ప్ర‌యోగం ఏమవ్వ‌బోతోందో?  ఇటీవ‌లి కాలంలో వ‌రుణ్ తేజ్- ఘాజీ సంక‌ల్ప్ రెడ్డి కాంబినేష‌న్ మూవీ `అంత‌రిక్షం 9000కెఎంపిహెచ్` పై వినిపించిన విమ‌ర్శ‌తో కూడిన సందేహం. ప్ర‌స్తుతం టాలీవుడ్‌ లో ఏ న‌లుగురు గుమిగూడినా అంత‌రిక్షం చ‌ర్చ త‌ప్ప‌నిస‌రి. అస‌లింత‌కీ ఈ ప్ర‌యోగం ఏమ‌వుతుందో? స‌ంక‌ల్ప్ హాలీవుడ్ స్టాండార్డ్స్‌ లో తీసి ఉంటాడా? అంత స‌త్తా ఉందా? అంటూ ప‌లు సందేహాల్ని వెలిబుచ్చారు.

అయితే అన్ని సందేహాల‌కు చెక్ పెట్టేస్తూ నేడు రిలీజైన ట్రైల‌ర్‌ కి జ‌నాల నుంచి అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింది. నేడు ఏఎంబీ సినిమాస్‌ లో తొలి ప్రీమియ‌ర్‌ గా వేసిన ఈ ట్రైల‌ర్‌ కి మీడియా జ‌నాల నుంచి- ముఖ్య అతిధుల నుంచి అద్భుత స్పంద‌న వ‌చ్చింది. అంత‌రిక్షం విజువ‌ల్స్‌ కి స్పెల్ బౌండ్ అయిపోయిన క్రిటిక్స్ మ‌హ‌దాద్భుతం అంటూ పొగిడేశారు.

సుకుమార్ మాట్లాడుతూ ``ఇది అద్భుతం.. అది అద్భుతం అంటూ ప్ర‌తి సినిమాని పొగిడేస్తాం కానీ, అద్భుతం అంటే ఇదీ`` అంటూ స్పెల్ బౌండ్ అయిపోయి పొగ‌డ్తల వ‌ర్షం కురిపించాడు. ట్రైల‌ర్‌ లో వేడెక్కించే విజువ‌ల్స్‌ కి సుక్కూ స్పెల్ బౌండ్ అయిపోయాడ‌ని అత‌డి మాట‌ల్ని బ‌ట్టి అర్థ‌మైంది. వ‌రుణ్ తేజ్ ప్ర‌యోగాల హీరో గా మ‌రో మెట్టు పైపైకి ఎక్క‌డం ఖాయ‌మైతే, ప్ర‌యోగాల ద‌ర్శ‌కుడిగా సంక‌ల్ప్‌ కి మ‌రోసారి జాతీయ స్థాయిలో ఎన‌లేని గుర్తింపు, గౌర‌వం తేవ‌డం ఖాయ‌మ‌ని వేదిక దిగువ‌న మీడియా, అతిధులంతా మాట్లాడుకోవ‌డం చ‌ర్చ‌కొచ్చింది. అంతేకాదు జలాంత‌ర్గామి నేప‌థ్యంలో ప్ర‌యోగాత్మ‌కంగా తెర‌కెక్కించిన ఘాజీ కి జాతీయ అవార్డులు ద‌క్కిన‌ట్టే మ‌రోసారి `అంత‌రిక్షం` చిత్రానికి జాతీయ అవార్డులు రావ‌డం ఖాయం అన్న ముచ్చ‌టా మ‌రోసారి తెర‌పైకొచ్చింది.

అస‌లే మీడియా జ‌నం మామూలు విజువ‌ల్స్‌ కి పెద్ద‌గా ఇంప్రెస్ కావ‌డం అన్న‌ది ఉండ‌దు. కానీ అంత‌రిక్షం ట్రైల‌ర్ చూసి పొగిడేయ‌డం చ‌ర్చ‌కొచ్చింది. ఏఎంబీ సినిమాస్‌ లో ట్రైల‌ర్ వేడుక గ్రాండ్ స‌క్సెస్ అయ్యింది. ఈ వేడుక‌లో వ‌రుణ్ తేజ్- అతిదీరావ్ హైద‌రీ- సంక‌ల్ప్ రెడ్డి స‌హా ముఖ్య అతిధులుగా సుకుమార్ త‌దిత‌రులు పాల్గొన్నారు. ఇక భారీ వీఎఫ్ఎక్స్- గ్రాఫిక్స్ వ‌ల్ల `అంత‌రిక్షం` ఆస‌ల్య‌మ‌వుతోందంటూ ఇటీవ‌ల పుకార్లు షికారు చేశాయి. అయితే అన్నిటినీ కొట్టేసిన చిత్ర‌యూనిట్ డిసెంబ‌ర్‌ 21న ప‌క్కా రిలీజ్ అని ప్ర‌క‌టించింది.
Tags:    

Similar News