రాజ్ కుంద్రా కేసు: అవి సాఫ్ట్ అశ్లీలమంటున్న దర్శకుడు

Update: 2021-07-28 17:30 GMT
అశ్లీల చిత్రాలు తీసిన కేసులో అరెస్ట్ అయిన రాజ్ కుంద్రా వ్యవహారం అనూహ్య మలుపులు తిరుగుతోంది. రాజ్ కుంద్రాను జూలై 27వరకు జ్యూడిషియల్ కస్టడీలో ఉంచాలని కోర్టు ఆదేశించింది. అదే సమయంలో ముంబై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు. సాక్ష్యాలను సేకరిస్తున్నారు. ఈ కేసులో రాజ్ కుంద్రా సంస్థకు చెందిన నలుగురు ఉద్యోగులు ప్రత్యేక సాక్షులుగా వచ్చినట్లు సమాచారం.  దీంతో కేసులో రాజ్ కుంద్రా బుక్కైనట్టుగా తెలుస్తోంది. తాజాగా ఈ కేసులో అరెస్ట్ అయిన ఓ దర్శకుడు దీనిపై స్పందించారు.

నీలి చిత్రాల కేసులో అరెస్ట్ అయిన వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను వెనకేసుకొచ్చాడు ఓ దర్శకుడు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా తాజాగా ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు దర్శకుడు తన్నీర్ హష్మిని మూడు గంటల పాటు విచారించారు. ఈ కేసులో అరెస్ట్ అయ్యి బెయిల్ మీద బయటకు వచ్చిన అతడు తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.

తాను జీవితంలో ఇప్పటివరకు రాజ్ కుంద్రాను కలవలేదని దర్శకుడు తన్నీర్ తెలిపారు. తాము నగ్న చిత్రాలు తీసినప్పటికీ కుంద్రా కంపెనీతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

తాను '20-25 నిమిషాలుండే నగ్న చిత్రాలు తీసిన మాట వాస్తవమేనన్నారు. కానీ వాటిని నగ్న సినిమాలు అనడం కాకుండా సాఫ్ట్ నగ్న చిత్రాలు అని పిలవవచ్చు అని దర్శకుడు పన్నీర్ తెలిపారు. అయినా ఇతర ఫ్లాట్ ఫామ్స్ కూడా ఎన్నో నగ్న చిత్రాలు తీస్తున్నాయని.. అలాంటి వాటిని ఎందుకు ప్రశ్నించరు అని తన్నీర్ నిలదీశారు.

ఇక  రాజ్ కుంద్రా వ్యవహారంపై హీరోయిన్ సోఫియా హయత్ సంచలన వ్యాఖ్యలు చేసింది. బిలియన్ డాలర్లు విలువ చేసే అశ్లీల ఫిల్మ్ బిజినెస్  అంత ఈజీగా కట్టడి అవుతుందా? అన్నది ఆరోపించింది. అది సాధ్యం కాదంటూ ట్విస్ట్ ఇచ్చింది. తాను బిగ్ బాస్ షో చేస్తున్నప్పుడు ఓ ఏజెంట్ తనను అలాంటి అశ్లీల సీన్లు చేయాలని అభ్యర్థించాడంటూ సంచలన ఆరోపణలు చేసింది. నిజంగానే ప్రొఫెషనల్ శృంగార సీన్లు తీసేవారు ఎవరూ ముందుగా ఆ సీన్స్ చేసి చూపించమని అడగరు అని సోఫియా ఆరోపించింది.

కాగా నటనపై ఆసక్తితో వచ్చిన వారిని బెదిరించి అశ్లీల చిత్రాలను తీసి ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో విడుదల చేస్తున్నట్టుగా ఆరోపణలు ఎదుర్కొన్న రాజ్ కుంద్రాను ఈనెల 19న పోలీసులు అరెస్ట్ చేశారు. 27 వరకు పోలీస్ కస్టడీ విధించారు. పోలీసుల విచారణలో రాజ్ కుంద్రా ఎక్కువగా ఒక వర్గం మోడల్స్ ను టార్గెట్ చేసి ఈ రొంపిలోకి లాగేవాడని తేలినట్టు ముంబైలో కథనాలు వెలువడుతున్నాయి. భారత్ లో ఈ అశ్లీల వీడియోలపై ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు చెక్ పెట్టినప్పటికీ ఇలా చాటుమాటుగా వీడియోలు తీశారని తేలింది. గత రెండు మూడేళ్లలో అశ్లీల వీడియోల హవా ఎక్కువగా పెరిగిపోయింది. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిని టార్గెట్ చేస్తున్నారని తెలిసింది.

ముంబైలో కొంతమంది మోడల్స్ ను ఇలాగే వేశ్యలతో అశ్లీల వీడియోలను షూట్ చేశారని పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న వారు దొరికితే వారితో కొన్ని నెలల పాటు డీల్ సెట్ చేసుకునే అవకాశం కూడా ఉందన్నారు.హీరోయిన్ పూనమ్ పాండే కూడా ఈ హాట్ షాట్స్ యాప్ కోసం అలాంటి ఆఫర్ తోనే లోబరుచుకునే ప్రయత్నం చేశారని వార్తలు వస్తున్నాయి. కానీ ఆమె డైరెక్టుగానే రాజ్ కుంద్రాపై పోలీస్ కేసు నమోదు చేసింది.

 రాజ్ కుంద్రా కేసులో సాక్ష్యం చెప్పేందుకు నలుగురు ఉద్యోగులు ముందుకు వచ్చినట్టు సమాచారం. వీరే ఈ కేసులో కీలకంగా మారనున్నారని పోలీసులు భావిస్తున్నారు. మేజిస్ట్రేట్ సమక్షంలో త్వరలో వీరి వాంగ్మూలాన్ని రికార్డు చేయనున్నట్లు తెలిసింది.
Tags:    

Similar News