కాపీ టెన్షన్ లో డిస్కో రాజా ?

Update: 2019-05-08 06:11 GMT
మొన్న ఏడాది రాజా ది గ్రేట్ తో కం బ్యాక్ సాఫీగా జరిగిపోయిందని సంబరపడ్డ మాస్ మహారాజా రవితేజకు ఆ ఆనందం ఎక్కువసేపు నిలవకుండానే గత సంవత్సరం ఏకంగా మూడు డిజాస్టర్లు పలకరించాయి. ఇవి ఎంతగా ప్రభావితం చేశాయి అంటే రవి సినిమా అంటేనే బయ్యర్లు భయపడెంత. ఒకప్పుడు కాంబోలతో సంబంధం లేకుండా మినిమం గ్యారెంటీ  మార్కెట్ ఉన్న హీరోకు ఇలాంటి పరిస్థితి వస్తే ఎంతైనా ఇబ్బందే.

అందుకే ఇప్పుడు విఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న డిస్కో రాజా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలిసింది. అయితే త్వరలో విడుదల కానున్న సమంతా ఓ బేబీ విషయంలో రవితేజ టీం కాస్త టెన్షన్ పడుతున్నట్టు వినికిడి. దీనికి కారణం లేకపోలేదు. రెండు సినిమాలు టైం పీరియడ్ ఆధారంగా చేసుకుని నడిచేవట. ఓ బేబీ కొరియన్ మూవీ మిస్ గ్రానీ రీమేక్. ఓ వయసు మళ్ళిన బామ్మ అనుకోకుండా వయసు తగ్గిపోయి పాతికేళ్ళ కాలానికి వెళ్లి ఏం చేస్తారు అనే దాని మీద ఇది రూపొందింది. డిస్కో రాజాలో కూడా ఇలాంటి పాయింటే ఉంటుందట.

అందుకే ఓ బేబీ రిలీజయ్యాక చూసి ఒకవేళ క్లాష్ అనిపించే పాయింట్ ఏదైనా ఉంటె మార్పు చేసుకునే విధంగా అలోచిస్తున్నరనే మాట వినిపిస్తోంది. కాని ఒకపక్క డిస్కో రాజా రెండో షెడ్యూల్ మొదలైంది. కాస్త స్లోగా చేసి సామ్ మూవీ వచ్చే దాకా వెయిట్ చేస్తారో లేక ఏదైతే అదైంది అనుకుని ముందుకు వెళ్తారో చూడాలి. ఇప్పుడీ చర్చ ఫిలిం నగర్ లో జోరుగా సాగుతోంది. విఐ ఆనంద్ గత చిత్రం ఒక్క క్షణం కూడా ఇలాంటి చిక్కుల్లో పడి నలిగిందే. దీనికి అలా కాకూడదు అనే జాగ్రత్త కాబోలు ఇదంతా
    

Tags:    

Similar News