లోఫ‌ర్ బ్యూటీ బెడ్ రూమ్ కులుకులు

Update: 2019-10-12 04:46 GMT
లోఫ‌ర్ బ్యూటీ దిశా ప‌టానీ కెరీర్ జ‌ర్నీ గురించి తెలిసిందే. ఫెమీనా మిస్ ఇండియా 2013 ర‌న్న‌ర‌ప్ గా నిలిచిన దిశా ఇండోర్ నుంచి ముంబై వైపు కెరీర్ జ‌ర్నీ సాగించింది. ఆ క్ర‌మంలోనే టాప్ మోడ‌ల్ గా ఓ వెలుగు వెలిగిన ఈ బ్యూటీ లోఫ‌ర్ చిత్రంతో క‌థానాయికగా ఎంట్రీ ఇచ్చింది. కానీ తొలి ప్ర‌య‌త్నం ఆశించిన స‌క్సెస్ ద‌క్క‌లేదు. అయినా బాలీవుడ్ ఎంట్రీ మూవీ `ఎం.ఎస్.ధోని- ది అన్ టోల్డ్ స్టోరి` (2016) త‌న‌కు బిగ్ బ్రేక్ నిచ్చింది.

ఆ త‌ర్వాత బోయ్ ఫ్రెండ్ టైగ‌ర్ ష్రాఫ్ తో ప్రేమాయ‌ణం.. త‌న‌తో క‌లిసి న‌టించిన భాఘి 2 సంచ‌ల‌న విజ‌యం సాధించ‌డం వ‌గైరా దిశాకు పెద్ద ప్ల‌స్ అయ్యాయి. ఇటీవ‌లే స‌ల్మాన్ భార‌త్ లో కీల‌క పాత్ర పోషించింది. ప్ర‌స్తుతం భాఘి 3 కోసం ప్రిప‌రేష‌న్ లో ఉంది. టైగ‌ర్ నుంచి విడిపోయినా.. కెరీర్ జ‌ర్నీలో మాత్రం తిరిగి అత‌డితో ప్ర‌యాణం సాగిస్తోంది.

దిశా కెరీర్ జ‌ర్నీ అంతా ఒకెత్తు అనుకుంటే.. టాప్ మోడ‌ల్ గా ప‌లు బ్రాండ్ల‌కు ప్ర‌చారం చేస్తూ భారీగా ఆర్జించ‌డంలోనూ ముందుంది. ప్ర‌ఖ్యాత కెల్విన్ క్లెయిన్ బ్రాండ్ అంబాసిడ‌ర్ గా దిశా మ‌రో లెవ‌ల్ ని ట‌చ్ చేసింది. ఈ బ్రాండ్ త‌న‌కు యూత్ లో ఫాలోయింగ్ ని పెంచింది.. సేమ్ టైమ్ దిశా అంద‌చందాలతో సీకే బ్రాండు మూల‌మూల‌ల్లో మార్మోగింది. తాజాగా బెడ్ రూమ్ ఫోటోషూట్ తో మ‌రోసారి అభిమానుల ముందుకు వ‌చ్చింది. అన్న‌ట్టు ఈసారి ఏ బ్రాండ్ కి ప్ర‌చారం చేస్తోంది అంటే.. అదో ప్ర‌ముఖ ప‌రుపులు- త‌ల‌గ‌డ‌ల కంపెనీ అని అర్థ‌మ‌వుతోందిగ‌! అమ్మ‌డు చెయ్యేసిన ఈ బ్రాండ్ కూడా ఎక్క‌డికో వెళ్లిపోవ‌డం గ్యారెంటీ!
Tags:    

Similar News