ఫోటో స్టొరీ: మళ్ళీ విరుచుకుపడిన దిశా తుఫాను

Update: 2019-06-19 17:30 GMT
ఒక జమానాలో హేమ మాలినిని 'డ్రీమ్ గర్ల్' అనే వారు.  ఆ తర్వాత కొంతమంది సుందరాంగులు ఇలాంటి బిరుదులు తెచ్చుకున్నారు. ఇక అతిలోక సుందరి శ్రీదేవి సంగతి తెలిసిందే.  ఆవిడకు అతితెలివైన వర్మ నుంచి అందమైన మహేష్ బాబు దాకా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.  ఇక ఈ జెనరేషన్ లో కూడా ఎంతో మంది బ్యూటీలు ఉన్నారు.  లస్ట్ భామ కియారా.. క్యూట్ బ్యూటీ అలియాలకు భారీ ఫాలోయింగే ఉంది.  కానీ వీరందరిలో దిశా పటాని స్పెషల్.

ఈ పాప ఒక్కసారి కనుక ఇన్నర్ వేర్ వేసిందంటే చాలు.. ఇంటర్నెట్ లో ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఈ ఇన్స్టాగ్రామ్ షేక్ అవుతుంది.  ఇప్పటికే ఇన్నర్ వేర్ అంటే కాల్విన్ క్లెయిన్ మాత్రమే అన్నట్టు పాపులర్ చేసిన ఈ  బ్యూటీ తాజాగా మరోసారి అంతః సౌందర్యాన్ని ప్రదర్శించింది.  ఒక మోడరన్ స్విమ్మింగ్ పూల్ దగ్గర ఇన్నర్ వేర్ లో ఖజురహో శిల్పంలా నిలబడింది.  ఇలాంటి పోజుల కోసమే ఒక్క గ్రాము కూడా అనవసరమైన ఫ్యాట్ లేకుండా ఉండేలా కసరత్తులు చేస్తూ ఉంటుంది.  ఈ కాలంలో కాళిదాసు లాంటి కవులు లేరు.. ఒకవేళ అలాంటి కళాపోషణ ఉన్నా .. కావ్యాలు రచించరు. ఈ ఫాస్ట్ జెనరేషన్ కు తగ్గట్టు కత్తిలాంటి కామెంట్లు పెట్టి సరిపెట్టుకుంటారు.

అందుకే  ఈ ఫోటోను పోస్ట్ చేసిన గంటల్లోపే 8 లక్షల లైకులు ఎనిమిది వేల కామెంట్లు పెట్టారు. "ఇది ఒక హోలీ బికినీ".. "ఖూబ్ సూరత్ కాలి జెహెర్".. "అందరూ కాల్విన్ కొనుక్కునేవరకూ ఊరుకోవా?".. "ఎవరైనా ఫైర్ డిపార్ట్ మెంట్ కు ఫోన్ చెయ్యండ్రా" అంటూ కామెంట్లు పెట్టారు. ఒకరు మాత్రం ఈ హాటు షో తట్టుకోలేక "ఫ్యాషన్ కు కూడా ఒక హద్దు ఉంటుంది" అంటూ చిర్రుబుర్రులాడారు.
Tags:    

Similar News