ఫోటో స్టోరీ: ఏ 'దిశ'లో వెళ్తోందో చెప్పేసింది

Update: 2016-11-23 03:43 GMT
పూరీ జగన్నాధ్ పరిచయం చేసిన లేటెస్ట్ బ్యూటీ దిశా పటానీ. లోఫర్ మూవీలో మెగా హీరో వరుణ్ తేజ్ సరసన అరంగేట్రం చేసిన ఈ బ్యూటీకి.. పెర్ఫామెన్స్-డ్యాన్సుల విషయంలో చాలా ఎక్కువ మార్కులు పడ్డాయి. అయితే.. అంతలోనే బాలీవుడ్ మూవీ ఎంఎస్ ధోనీలో ఆఫర్ రావడం.. అది చేస్తుండగానే జాకీచాన్ తో కలిసి కుంగ్ ఫు యోగాలో నటించే అవకాశం రావడంతో.. కెరీర్ మహా స్పీడ్ అందుకుంది.

జాకీచాన్ మూవీ తర్వాత ఏం చేస్తుందనే విషయం ఇప్పటివరకూ తేలలేదు. కానీ తన రూట్ ఏంటో మాత్రం సిగ్నల్స్ ఇచ్చేస్తోంది. ఫుల్లుగా డ్రస్ వేసినట్లు కనిపిస్తున్నా.. క్లీవేజ్ షోతో కేకలు పెట్టించేందుస్తోంది. డార్క్ కలర్ డ్రస్ అయ్యేసరికి.. అమ్మడి దేహం మిలమిలా మెరుస్తూ మరింతగా ఆకర్షిస్తోంది. మినిమం మేకప్ తో మాగ్జిమం అటెన్షన్ ఎలా డ్రా చేయాలో అప్పుడే దిశకు అర్ధమైపోయిందని తెలుస్తూనే ఉంది.

ప్రస్తుతం ఈ భామ చేతిలో సినిమాలేమీ లేకపోయినా.. ఆఫర్లకు మాత్రం కొదువ లేదు. అయితే.. బాలీవుడ్ లో క్రేజీ ప్రాజెక్టులను పట్టుకోవడం అమ్మడి కాన్సెప్ట్. గ్లామర్ రోల్స్ తోనే ఇది సాధ్యం అనే విషయం అర్ధం చేసేసుకున్న దిశా పటానీ.. ఆ వైపు నుంచే పటాయించేందుకు ప్రయత్నాలు ప్రారంభించేసింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News