వర్మలోని మానవీయ కోణం తెలుసా?

Update: 2021-07-06 05:30 GMT
ఎప్పుడూ తిట్టిపోయడమేనా? అప్పుడప్పుడూ అప్యాయత, అనురాగాన్ని కూడా రాంగోపాల్ వర్మ పంచుతుంటాడు. తనలోనా మానవీయతను బయటపెట్టుతుంటాడు. వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఏం చేసినా అది వివాదాస్పదంగా మారుతుంటుంది. మరీ ముఖ్యంగా వర్మ ట్వీట్ చేశారంటే అది వివాదాల మయంగా మారుతూనే ఉంటుంది. అదో పెద్ద రచ్చకు దారితీస్తుంది.

ఎప్పుడు సినీ, రాజకీయ ప్రముఖులను టార్గెట్ చేసే రాంగోపాల్ వర్మ ఈసారి ఓ మానవీయ అంశంపై మనసుకు హత్తుకునేలా ఓ ట్వీట్ చేశాడు. అదిప్పుడు వైరల్ గా మారింది. వర్మలో కూడా ఈ యాంగిల్ ఉందా? అని అసూయ పడేలా ఆ ట్వీట్ ఉండడం విశేషం.

తాజాగా రాంగోపాల్ వర్మ అక్కచెల్లెళ్లపై స్పందించిన తీరు ప్రతి ఒక్కరిని కదిలించేలా ఉంది. వర్మ కూడా ఇలా స్పందిస్తాడా? అని అందరూ ఆశ్చర్యపోతున్న పరిస్థితి ఉంది. కరుడుగట్టిన వర్మనేనా? ఇలా చేసిందని అని అందరూ అనుకుంటున్నారు.

మధ్యప్రదేశ్ లో ఇద్దరు గిరిజన అక్కాచెల్లెళ్లను కుటుంబ సభ్యులే అత్యంత పాశవికంగా చంపడం యావత్ దేవాన్ని షాక్ కు గురిచేసింది. మధ్యప్రదేశ్ లోని ధార్ జిల్లా పిపల్య గ్రామానికి చెందిన  గిరిజన అక్కాచెల్లెళ్లు తమ మేనమామ కూమారులతో ప్రేమలో ఉన్నారని కుటుంబ సభ్యులే జుట్టు పట్టుకొని ఈడ్చుకొని కొట్టి చంపిన వైనం వీడియో సోసల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ఈ ఘటనపై రాంగోపాల్ వర్మ ఎమోషనల్ అయ్యారు. తన ఆవేదనను, ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. ఈ దారుణాన్ని తాను నమ్మలేకపోతున్నట్టుగా చెప్పుకొచ్చారు. దాడికి పాల్పడిన వాళ్లందరికీ తగిన శిక్ష వేయకపోతే తనకు ఈ దేశంపై నమ్మకం పోతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

వర్మ సైతం ఇలా సామాజిక సృహను తెచ్చుకొని ఒక సున్నిత అంశంపై స్పందించిన తీరుకు నిజంగా నెటిజన్లు ఆశ్చర్యపోతున్న పరిస్థితి నెలకొంది.
Tags:    

Similar News