25 రోజుల్లో 100 కోట్ల క్ల‌బ్ లో `డాక్ట‌ర్`

Update: 2021-11-03 04:25 GMT
శివకార్తికేయన్ `డాక్టర్` 100 కోట్ల క్లబ్‌లో చేరింది. వినయ్ రాయ్-ప్రియాంక మోహన్ ఈ చిత్రంలో ఇత‌ర ప్రధాన పాత్రధారులు. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వ‌హించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఘ‌న‌విజ‌యం సాధించి వంద కోట్ల క్ల‌బ్ తో నిర్మాత‌లు ఎగ్జిబిటర్ లకు చాలా అవసరమైన ఉత్సాహాన్ని తెచ్చిపెట్టింది. మహమ్మారి సమయంలో దెబ్బతిన్న వారికి ఇది పెద్ద ఊర‌ట‌.

డాక్ట‌ర్ చిత్రం అక్టోబ‌ర్ 9న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. సెకండ్ వేవ్ అనంత‌రం విడుద‌లైన‌ తొలి భారీ ప్రాజెక్ట్ ఇది. ఇప్ప‌టివ‌ర‌కూ విడుద‌ల కోసం వేచి ఉన్న అనేక ఇతర చిత్రాలకు ఈ చిత్రం హోప్ ని పెంచింది. త‌దుప‌రి రిలీజ్ కానున్న అన్నాథే కి ఇది పెద్ద భ‌రోసా అనే చెప్పాలి.

యాక్షన్-కామెడీ క‌థాంశంతో వ‌చ్చిన ఈ సినిమాకి క్రిటిక్స్ నుంచి ప్ర‌శంస‌లు ద‌క్కాయి. విమర్శకులు ప్రేక్షకులు ప్ర‌శంసించిన చిత్ర‌మిది. KJ స్టూడియోస్ తాజాగా ట్వీట్ చేస్తూ, ``25వ రోజు సందడిగా అడుగుపెడుతున్నాం! మీ అభిమాన ఎంటర్ టైనర్ #DOCTOR 100 కోట్ల క్లబ్ లో చేరింది. మీ అపారమైన మద్దతు ప్రేమకు ధన్యవాదాలు. మీరు దీన్ని సాధించారు #DOCTOR Hits100Crs #మెగా బ్లాక్ బ‌స్ట‌ర్ DOCTOR. నెల్సన్ - శివకార్తికేయన్ కి అండ‌గా నిలిచినందుకు ప్రజలకు ధన్యవాదాలు`` అని తెలిపింది.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. శివకార్తికేయన్ త‌దుప‌రి బ్యాక్ టు బ్యాక్ చిత్రాల‌తో బిజీగా ఉన్నారు. డాన్ పేరుతో రొమాంటిక్ కామెడీలో న‌టిస్తున్నారు. ఇందులో అతను సూరి-ప్రియాంకతో మళ్లీ క‌లిసి ప‌ని చేస్తున్నారు. `అయాలాన్` చిత్రాన్ని శివ‌కార్తికేయ‌న్ పూర్తి చేశాడు. అట్లీ మాజీ అసోసియేట్ తో అతని తదుపరి చిత్రం సింగ పాటై పూర్తి చేయాల్సి ఉంది.
Tags:    

Similar News