పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ కాటమరాయుడు షూటింగ్ మొదలైపోయింది. జూన్ చివరి వారంలోనే సెట్స్ పైకి వెళ్లాల్సిన ఈ మూవీ.. అనుకోని మార్పుల కారణంగా లేట్ అయింది. దీనికి తోడు పొలిటికల్ గా కూడా పవన్ కొంత యాక్టివ్ కావడంతో.. పిక్చరైజేషన్ విషయంలోను.. అసలీ ప్రాజెక్టు పైనా రకరకాల సందేహాలు ఏర్పడి.. చివరకు సినిమా మొదలుపెట్టారు.
కాటమరాయుడుకి కెప్టెన్ షిప్ విషయంలో ఎస్ జే సూర్య వెళ్లిపోయి.. డాలీ వచ్చి చేరిన సంగతి పాతదే. అయితే.. ఈ దర్శకుడు వచ్చాక స్క్రిప్ట్ కి మార్పులు చేసుకున్న సంగతి కూడా పాత విషయమే. కానీ ఈ మార్పులను సెట్స్ పైకి వచ్చాకే చూశాడట పవన్. ప్రస్తుతం స్క్రిప్ట్ టర్న్ తీసుకున్న తీరు.. డైరెక్షన్ విషయంలో డాలీ క్లారిటీ.. సబ్జెక్ట్ విషయంలో చేసిన డెవలప్మెంట్స్ అన్నీ.. పవన్ కి విపరీతంగా నచ్చేశాయని అంటున్నారు. ఈ విషయాన్ని నేరుగానే చెప్పేశాడట కూడా.
రీసెంట్ ఛేంజెస్ పై పవన్ ని ఎలాగైనా ఒప్పించాలని అనుకుంటున్న తరుణంలో.. అన్నీ సూపర్బ్ అని పవన్ చెప్పేయడంతో ఊపిరి పీల్చుకున్నారట దర్శకుడు డాలీ.. నిర్మాత శరత్ మరార్. ఇక ఈ సినిమాలో పవన్ కి తమ్ముళ్లుగా నటించే నలుగురి ఎంపిక ఫైనల్ అయిపోతే.. ఫుల్ స్పీడ్ లో పిక్చరైజేషన్ చేసేయనున్నారని తెలుస్తోంది. త్వరలోనే గబ్బర్ సింగ్ భామ శృతి హాసన్ కూడా కాటమరాయుడికి తోడు రానుందట.