ఆ మధ్యన ఒకసారి దర్శకుడు త్రివిక్రమ్.. ఫేమస్ లిరిసిస్ట్ సిరివెన్నెల గురించి చాలా ఉద్రేకపూరితమైన స్పీచ్ ఒకటి ఇచ్చేసి.. నన్ను దయచేసి ఇలాంటి ఫంక్షన్లకు పిలవకండి బాస్.. నేను ఆవేశాన్ని ఆపుకోలేను అంటూ కామెంట్ చేశాడు. ఇప్పుడు అదే తరహాలో.. అలాంటి ఉద్రేకపూరితమైన స్పీచ్ ఇవ్వకుండానే.. మంచు విష్ణు తనను ఆడియో ఫంక్షన్లకు పిలవొద్దని అంటున్నాడు.
చాలారోజుల నుండి తోటి హీరోలైన నిఖిల్ అండ్ రాజ్ తరుణ్ తో విష్ణు కు మాంచి సాన్నిహిత్యం ఉంది. అందుకేనేమో విష్ణు సినిమాల ఆడియో ఫంక్షన్లకు నిఖిల్ వస్తుంటాడు. అయితే మొన్న వైజాగ్ లో జరిగిన మోహన్ బాబు 40 ఏళ్ళ సినిమా జర్నీ అభినందన సభకు హై ఫీవర్ ఉన్నా కూడా నిఖిల్ విచ్చేశాడు. అందుకే మొన్న ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమా ఆడియో ఫంక్షన్ కు విష్ణు కూడా విచ్చేశాడు. కాని ఒక షాకిచ్చాడు. ''నన్ను ఆడియో ఫంక్షన్లకు పిలవకండి. మొన్న నిఖిల్ జ్వరంతోనే వచ్చాడు కాబట్టి.. ఇప్పుడు నేను కూడా వచ్చాను. ఇక మీదట నీ సినిమా ఆడియో ఫంక్షన్లకు నేను రాను. స్టేజీల మాట్లాడటం అన్నా.. స్టేజెక్కడం అన్నా.. నాకు అంత ఇష్టం ఉండదు'' అంటూ కలరింగ్ ఇచ్చాడు విష్ణు.
ఆ తరువాత మైక్ అందుకున్న నిఖిల్.. ''విష్ణు భాయ్.. ఆ రోజు వైజాగ్ రావడం నా అదృష్టం. నన్ను చాలా బాగా చూసుకన్నారు. సరే నువ్వు రిక్వెస్ట్ చేశావ్ కాబట్టి ఇక మీదట నేను నిన్ను నా సినిమాల ఆడియో ఫంక్షన్లకు పిలువనులే'' అనేశాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/