ఈ ఏడాది విడుదలైన దక్షిణాది చిత్రాల్లో కొంతకాలంగా ఇండస్ట్రీలో నానుతున్న పేరు దృశ్యం-2. మలయాళంలో తెరకెక్కిన ఈ సీక్వెల్ మూవీ దేశవ్యాప్తంగా అన్ని భాషల ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్, మీనా కలిసి నటించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ దృశ్యం సినిమాకు సీక్వెల్ గా రూపొందింది. అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన దృశ్యం-2 అన్ని వర్గాల వారిని మెప్పించి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఫస్ట్ పార్ట్ రూపొందించిన దర్శకుడు జీతూ జోసెఫ్ ఈ సీక్వెల్ కూడా రూపొందించాడు. అయితే దృశ్యం కంటే సీక్వెల్ దృశ్యం-2 భారీ సక్సెస్ కావడం విశేషం.
మొదటి భాగం దృశ్యం లాగే ఇప్పుడు దృశ్యం-2 కూడా ఇతర భాషల్లోకి రీమేక్ అవుతోంది. ఇప్పటికే పలు భాషల రీమేక్ హక్కులను కూడా దక్కించుకున్నారు మేకర్స్. అయితే దృశ్యం మూవీ తెలుగులో కూడా అదేపేరుతో రీమేక్ అయింది. ఈ సినిమా తెలుగు వెర్షన్ లో నటించిన వెంకటేష్, మీనాలే ఈసారి సీక్వెల్లో కూడా నటిస్తున్నారు. ఈ సినిమాను డి. సురేష్ బాబు నిర్మిస్తున్నాడు. ఇదిలా ఉండగా.. ఈ ఏడాది మార్చ్ నెలలో షూటింగ్ ప్రారంభించిన దృశ్యం తెలుగు సీక్వెల్ షూటింగ్ శరవేగంగా అనుకున్న టైంలోపే పూర్తి చేశారు మేకర్స్. మార్చ్ నెలలో ప్రారంభించిన దృశ్యం సీక్వెల్ షూటింగ్ ఏప్రిల్ నెల రెండో వారంలో పూర్తి అయినట్లు మేకర్స్ కూడా ట్విట్టర్ వేదికగా తెలియజేసారు.
అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ సెట్ కూలిపోయినట్లు తెలుస్తుంది. ఇటీవల కేరళలో కురిసిన వర్షాలకు.. ఆకస్మికంగా సంభవించిన తుఫాన్ కారణంగా దృశ్యం సెట్ డామేజ్ అయిపోయిందట. అయితే దృశ్యం-2 షూటింగ్ ఇంకాస్త మిగిలి ఉండటంతో ఆ షూటింగ్ ఇప్పట్లో జరపడం వీలు కాదు కాబట్టి.. కరోనా పరిస్థితి నుండి బయట పడగానే ఆ మిలిగిన వర్క్ కంప్లీట్ చేయాలనీ మేకర్స్ ఆలోచిస్తున్నారట. అలాగే లాక్డౌన్ అనంతరం షూటింగ్ పూర్తి చేసి వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నారట. ఈ విషయం పై ప్రస్తుతం వెంకీ అండ్ టీమ్ ఆలోచనలో పడ్డారని టాక్. మరి ఇప్పటికే తుఫాన్ వర్షాల కారణంగా వేరే సినిమాల సెట్స్ కూడా డామేజ్ అయ్యాయని తెలిసిందే. మరి చూడాలి ఏం ప్లాన్ చేస్తారో..!