టాలీవుడ్ లో డబ్బింగ్ సినిమాలు భారీ విజయాలను సొంతం చేసుకున్న దాఖలాలు ఉన్నాయి. రజినీకాంత్.. కమల్ హాసన్ తో పాటు తమిళ సినీ ఇండస్ట్రీకి చెందిన సూర్య మరి కొందరు తెలుగు హీరోల స్థాయిలో ఇక్కడ మార్కెట్ ను కలిగి ఉన్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ హీరోల సినిమాలు వచ్చిన సమయంలో ఒక డబ్బింగ్ సినిమా అని కాకుండా డైరెక్ట్ సినిమా కోసం ఎదురు చూసినట్లే చూస్తారు.
తెలుగు మార్కెట్ లో కేవలం తమిళ హీరోలకు మాత్రమే ఇన్నాళ్లు చోటు ఉండేది. కాని ఇప్పుడు మొదటి సారి మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కు చోటు దక్కింది. ఆయన నటించిన తెలుగు సినిమా సీతారామం మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఇక నుండి ఆయన టాలీవుడ్ లో ఓ రేంజ్ లో దూసుకు పోతాడనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
మహానటి సినిమా సమయంలోనే ఆయన అంటే తెలుగు ప్రేక్షకుల్లో మంచి అభిమానం ఏర్పడింది. కాని ఆ సినిమా లేడీ ఓరియంటెడ్ సినిమా అవ్వడం వల్ల దుల్కర్ సల్మాన్ కు ఒకింత తక్కువ ఆధరణ వచ్చిందని చెప్పాలి. కానీ ఇప్పుడు దుల్కర్ సల్మాన్ సీతారామం సినిమా తో టాలీవుడ్ లో యంగ్ స్టార్ హీరోల జాబితాలో చేరి పోతాడు అనడంలో సందేహం లేదు.
ఒక వైపు వరుసగా దుల్కర్ మలయాళం లో సినిమాలు చేస్తున్నాడు. కనుక సీతారామం ఎఫెక్ట్ తో ఇక నుండి ఆయన మలయాళ సినిమాలు దాదాపు అన్నీ కూడా తెలుగు లో డబ్ అవ్వడం మనం చూడబోతున్నాం. మలయాళంలో చేసినా తెలుగు లో చేసినా కూడా ఇక నుంచి తెలుగు లో దుల్కర్ సల్మాన్ కి మంచి మార్కెట్ ఉంటుంది అనేది సినీ విశ్లేషకుల అభిప్రాయం.
తెలుగు ప్రేక్షకులు దుల్కర్ సల్మాన్ ను తెలుగు హీరోగా స్వీకరిస్తున్నారు.. తెలుగు ప్రేక్షకుల అభిమానంను దక్కించుకున్న ఇతర హీరోల జాబితాలో దుల్కర్ సల్మాన్ కూడా చేరిపోయాడు.
ఇప్పటి వరకు కేవలం తెలుగు లో రజిని.. కమల్.. సూర్య.. కార్తి తో పాటు మరి కొందరికి మాత్రమే ఉన్న క్రేజ్ మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ కూడా దక్కించుకున్నాడు. సీతారామం లో రామ్ పాత్రతో దుల్కర్ బాగా కనెక్ట్ అయ్యాడు.