'ఈగ' ఆడియో లాంచ్ తో రూటు మారింది
ఈగ' సినిమా సమంత కెరియర్లో ఎప్పటికీ నిలిచిపోయే ఒక స్పెషల్ సినిమా. ఎందుకంటే అమ్మడు ఆ సినిమాలోనే తొలిసారిగా తన టాలెంట్ చూపించడానికి స్కోప్ దక్కింది. అప్పటివరకు అన్ని సినిమాల్లో గ్లామరసం ఆరబోసే పాత్రలే కాని.. ఈగలో మాత్రం యాక్టింగ్ కూడా చేయాల్సి వచ్చిందిలే. అయితే ఆ సినిమాను సమంతను వేరే విధంగా కూడా మార్చేసింది.
ఇప్పుడు సౌత్ ఇండియా స్టయిల్ ఐకాన్ అంటే వెంటనే ఎవరైనా కూడా సమంత పేరే చెబుతారు. బాలీవుడ్లో సోనమ్ కపూర్ ఎలాగో.. ఇక్కడ సమంత అలాగనమాట. అయితే అసలు నార్మల్ గా ఉండే సమంత.. ఇంత స్టయిలిష్ గా మారిపోవడానికి.. చాలా ఖరీదైన డిజైనర్ వేర్ వేసుకుని మాత్రమే ఈవెంట్స్ కు రావడానికి.. ఏదైనా కారణం ఉందా? అదే 'ఈగ' ఆడియో ఫంక్షన్. ఈ సినిమా తెలుగు ఆడియో ఫంక్షన్ కు ఒక స్కర్ట్ అండ్ టాప్ లో వచ్చిన సమంతను.. అదేం డ్రస్సు బాబోయ్ అంటూ కామెంట్లు చేశారట. తరువాత తమిళ వర్షెన్ నాన్-ఇ ఆడియోకు వెళినప్పుడు.. సింగిల్ పీస్ మోడ్రన్ డ్రస్సు వేసుకుంటే.. ఆ ఫ్లాషింగ్ లైట్ గ్రీన్ ఏంటి నాయనో అంటూ వెటకారాలు ఆడేశారట.
''ఈగ సినిమా ఆడియో లాంచ్ లో నా డ్రస్సుపై వచ్చిన కామెంట్లు బాధించాయి. అందుకే అప్పుడే డిసైడయ్యా.. ఇక స్టయిల్ అంటే ఏంటో చూపెట్టాలని. సరిగ్గా అప్పుడే 2012లో నీరజా కోన అమెరికా నుండి ఇక్కడికి వచ్చింది. సో ఇద్దరం కలసి ఇలా ఇంప్రెస్ చేస్తున్నాం'' అంటూ చెప్పింది. సమంతను దాదాపు అన్ని ఈవెంట్లకూ నీరజా కోన స్టయిలింగ్ చేస్తుందిలే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/