సూపర్ స్టార్ మహేష్ నటించనున్న 28వ సినిమా (SSMB28)కి త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయిక. అతడు-ఖలేజా తర్వాత ఈ జోడీకి మూడో సినిమా. మారిన ట్రెండ్ లో త్రివిక్రమ్ ఇప్పుడు ఒక అసాధారణ ఫీట్ కి రెడీ అవుతున్నారన్న గుసగుస వేడెక్కిస్తోంది. ఈసారి మహేష్ తో అతడు పాన్ ఇండియా సినిమాని తెరకెక్కించనున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.
మహేష్ తదుపరి రాజమౌళి దర్శకత్వంలో నటించాల్సి ఉండగా.. అంతకుముందే అతడు పాన్ ఇండియా స్టార్ గా తొలి అడుగు వేసేందుకు త్రివిక్రమ్ తో కలిసి సన్నాహకాల్లో ఉన్నారు. దీనికోసం స్పెషల్ గా ఉండే కథాంశం రెడీ చేయాల్సిందిగా త్రివిక్రమ్ ని కోరారని టాక్ వినిపించింది.
ఇప్పటివరకు తన సినిమాల కోసం పాన్-ఇండియా విడుదలను సీరియస్ గా ప్లాన్ చేయని మహేష్ SSMB28 తో హిందీ మార్కెట్లోనూ మ్యాజిక్ చేయాలని భావిస్తున్నారట.
నిజానికి త్రివిక్రమ్ తెరకెక్కించిన 'అల వైకుంఠపురములో' చిత్రం హిందీ బెల్ట్ లోనూ పెద్ద హిట్. అందుకే మహేష్- త్రివిక్రమ్ బృందం ఇప్పుడు పాన్ ఇండియా స్క్రిప్టుతో ఆ రేంజులో హిట్టుపై కన్నేశారన్న చర్చా సాగుతోంది. ఉత్తరాది ఆడియెన్ సెన్సిబిలిటీస్ కి తగ్గట్టు గా ఒక అద్భుత కథాంశాన్ని ఈ మూవీకోసం ఎంచుకున్నారన్న టాక్ కూడా వినిపిస్తోంది.
తెలుగు సినిమాలు ఇటీవల ఉత్తరాదిన బంపర్ హిట్లు కొడుతున్నాయి. పుష్ప- ఆర్.ఆర్.ఆర్ సాధించిన విజయాల తర్వాత మేజర్ - కార్తికేయ 2 బంపర్ హిట్లుగా నిలిచాయి. అందుకే ఇప్పుడు మహేష్ కూడా హిందీ మార్కెట్ పై దృష్టి సారించారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
తెలుగు హిందీ వెర్షన్లను ఏకకాలంలో రికార్డు స్థాయిలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మహేష్ లాంటి ఛరిష్మా ఉన్న హీరో సినిమా హిట్టు టాక్ తెచ్చుకుంటే చాలు. ఉత్తరాదినా చక్కని వసూళ్లతో అదరగొట్టేందుకు ఛాన్సుంటుంది. ఈ చిత్రం 2023 ఏప్రిల్ 28న విడుదల కానుంది.