'రాజావారు రాణిగారు' సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. గతేడాది 'SR కల్యాణ మండపం' చిత్రంతో కమర్షియల్ సక్సెస్ అందుకున్నాడు. అయితే ఇటీవల 'స్టెబాస్టియన్ PC 524' మూవీతో ప్లాప్ చవిచూసినప్పటికీ.. కిరణ్ అప్ కమింగ్ చిత్రాలతో స్ట్రాంగ్ లైనప్ నే సెట్ చేసుకోగలిగాడు.
కిరణ్ అబ్బవరం హీరోగా గోపీనాథ్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ 'సమ్మతమే' రిలీజ్ కు రెడీ అయింది. జూన్ 24న థియేటర్లలోకి రాబోతోంది. అలానే కార్తీక్ శంకర్ అనే కొత్త దర్శకుడితో చేసిన 'నేను మీకు బాగా కావాల్సిన వాడిని' అనే మూవీ ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదే క్రమంలో గీతా ఆర్ట్స్ బ్యానర్ లో మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో 'వినరో భాగ్యము విష్ణు కథ' అనే సినిమా చేస్తున్నాడు కిరణ్. అలానే మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో యువ హీరో ఓ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు తీసుకొచ్చాడు. పెద్ద ప్రొడక్షన్ హౌస్ లలో చేస్తున్న ఈ రెండు చిత్రాలు డిసెంబర్ లోపు రిలీజ్ అవుతాయి.
అయితే మనకందిన సమాచారం ప్రకారం అగ్ర నిర్మాత ఏఎం రత్నం మరియు ఏషియన్ సునీల్ ప్రొడక్షన్ వంటి పెద్ద బ్యానర్‌లలో కిరణ్ అబ్బవరం మరో 3 చిత్రాలకు సంతకం చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలు 2023 చివరి నాటికి తెరపైకి రానున్నాయి.
వీటన్నింటిని పరిగణనలోకి తీసుకుంటే, ఈ లైనప్ లో రెండు సినిమాలు బాక్సాఫీస్ హిట్స్ గా నిలిచినా.. కిరణ్ అబ్బవరం టైర్-2 హీరోల జాబితాలో చేసే అవకాశం ఉంది. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా కేవలం టాలెంట్ మరియు హార్డ్ వర్క్ తో స్టార్ డమ్ సాధించిన హీరోలను పరిశీలిస్తే.. టాలీవుడ్ లో తక్కువ మందే ఉన్నారు.
అలాంటి వారిలో ఒకరిగా కిరణ్ అబ్బవరం నిలుస్తాడని సినీ అభిమానులు భావిస్తున్నారు. ప్రస్తుతానికైతే ఫుల్ జోష్ లో వరుస సినిమాలను లైన్ లో పెడుతూ వస్తున్నాడు. మరి అతని ప్రయత్నాలు ఫలించి.. కెరీర్ లో నెక్స్ట్ లెవల్ కు చేరుతాడో లేదో చూడాలి.